
వస్తువుల ధరలను నియంత్రించడంలో భాగంగా డిసెంబర్-మార్చి నెలల్లో భారతదేశ సరుకుల ఎగుమతులు 7% తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, రష్యా-ఉక్రెయిన్ యుద్దాలే ఎగుమతులు తగ్గడానికి కారణం అని ఇక్రా ఈ నివేదికలో పేర్కొంది.
అయితే, క్రిస్మస్ పండుగకి ముందు ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నా, వస్తువుల ధరల్లో నియంత్రణ వల్ల ఎగుమతులు తగ్గుతాయని అంచనా వేస్తోంది. నవంబర్ నెలలో సరుకుల ఎగుమతులు 31 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2023 ఏప్రిల్ వరకు క్షీణించి 23.89 బిలియన్ డాలర్లకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఇక్రా సూచిస్తుంది.