డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా సమ్మె

 డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా సమ్మె

న్యూఢిల్లీ, వెలుగు: గుజరాత్‌‌లో రేషన్ డీలర్లవిషయంలో అవలంబిస్తున్న విధానాన్నే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్రాన్ని భారత రేషన్ డీలర్ల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శనివారం ఢిల్లీలోని బగ్గా భవన్‌‌లో భారత రేషన్ డీలర్ల ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ విశ్వంబర్ బసు అధ్యక్షతన జాతీయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు.

తర్వాత డీలర్ల సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ నాయికోటి రాజు మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌‌లో డీలర్లకు రూ.40 వేల జీతం, సేల్‌‌పై రూ.2 కమీషన్ ఇస్తున్నారని తెలిపారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. ఒకే కమీషన్ విధానం అమలుతో పాటు కమీషన్‌‌ను రూ.300 నుంచి రూ.500కు పెంచాలని కోరారు. డీలర్లు చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలన్నారు. డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని తీర్మానం చేశామన్నారు.