జగిత్యాలలో ఆగని రేషన్ ​బియ్యం దందా..!

జగిత్యాలలో ఆగని రేషన్ ​బియ్యం దందా..!
  •     మిల్లర్లు, రేషన్ డీలర్లదే కీలక పాత్ర 
  •     దళారుల సాయంతో ఇంటింటికీ తిరిగి కొంటున్న వైనం 
  •      ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌‌‌‌‌‌‌‌.. 
  •      అక్రమార్కులకు కాసుల వర్షం 

జగిత్యాల/మల్యాల, వెలుగు: సర్కార్ అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతున్నాయి. టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, పోలీసులు దాడులు చేస్తున్నా దందా ఆగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండగా ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో అక్రమార్కులు దందాకు తెరతీశారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కొంటూ రీసైక్లింగ్‌‌‌‌‌‌‌‌ చేసి అమ్ముతున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు కోట్లాది రూపాయలు గండి పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా క్షేత్రస్థాయిలో కింది స్థాయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

బైక్‌‌‌‌‌‌‌‌లు, ఆటోల్లో తిరుగుతూ కొంటున్నరు

కొందరు మిల్లర్లు ప్రతి నెలా మొదటి, రెండు వారాల్లో పంపిణీ చేసే రేషన్ బియాన్ని సేకరించేందుకు ప్రత్యేకంగా దళారులను నియమించారు. వీరు బైకులు, ట్రాలీ ఆటోల్లో ఇంటింటికి తిరిగి బేరం ఆడి కేజీ రూ. 8 నుంచి రూ. 14 వరకు చెల్లిస్తూ రేషన్ బియ్యాన్ని కొంటున్నారు. పెద్ద ఎత్తున సేకరించిన తర్వాత లారీలు, ఇతర భారీ వాహనాల ద్వారా కేజీ రూ. 20 నుంచి రూ. 22 చొప్పున రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. 

అక్కడి నుంచి రీసైక్లింగ్​ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ దందా చేస్తున్నారు. కాగా, కొన్ని చోట్ల రేషన్ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని కేజీకి రూ. 8 చొప్పున చెల్లిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని ఒప్పందం చేసుకున్న మిల్లర్లకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత వాటిని ప్యాక్ చేసి ఆయా మిల్లుల పేర లేబులింగ్​చేసి మరీ సొంత బ్రాండ్ పేరిట నిజామాబాద్ మీదుగా నాగపూర్, నాందేడ్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.  కొందరు అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల పట్టుపడ్డ  పీడీఎస్ బియ్యం

ఈ నెల 20న కొడిమ్యాల మండలం నర్సింహుపల్లె గ్రామంలోని గంగిరెద్దు కాలనీలో నిల్వ ఉంచిన 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.
 
ఫిబ్రవరి 19న రాయికల్ మండలం రామాజీ పేట గ్రామంలోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ చేసిన 12 క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్ సప్లై ఆఫీసర్లు పట్టుకున్నారు. 

ఈ నెల 18న  బీర్పూర్ మండలం కోమన్‌‌‌‌‌‌‌‌పల్లి శివారులో ఆటోలో 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న  చంద్రశేఖర్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. 

ఫిబ్రవరి 13న మల్యాల మండలం లోని కొండగట్టు పంచముఖ ఆలయ సమీపం లో నిల్వ చేసి ఉంచిన 145.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకుని మల్యాల గిడ్డంగికి తరలించారు.