హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంజేపీలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను కరిచిన ఎలుకలు

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంజేపీలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను కరిచిన ఎలుకలు

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపు మహాత్మా జ్యోతిపూలే గర్ల్స్‌‌‌‌‌‌‌‌ గురుకులంలో రెండు రోజుల కింద ఇద్దరు స్టూడెంట్లను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కరవడంతో గురుకుల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా సివిల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించి చికిత్స అందించారు. 

సోమవారం ఉదయం పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇవ్వడంతో వారు గురుకులానికి చేరుకొని స్కూల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ శారదను వివరణ కోరగా స్కూల్‌‌‌‌‌‌‌‌ ప్రాంగణంలో పాత డిగ్రీ కాలేజీ సామగ్రిని నిల్వ చేయడంతో ఎలుకల బెడద ఉందని, వాటిని నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఎలుకలను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో చందులాల్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో వైద్యబృందం స్టూడెంట్లకు వైద్య పరీక్షలు చేశారు.