
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలోని కేజీబీవీ విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఆగస్టు 22న రాత్రి నిద్రపోతున్న 9 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. వెంటనే విద్యార్థులను స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో స్టూడెంట్స్ కి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. విద్యార్థుల రక్షణ పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు బీసీ వెల్ఫేర్ విద్యాలయాల్లో విద్యార్థులు మృతి చెందిన ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం...ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచడానికి ,మౌలిక వసతుల ఏర్పాటుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు వారంలో రెండు రోజులు స్కూళ్లను విజిట్ చేయాలని ఆదేశించారు. అయినా కొన్నిచోట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.