RaviTeja: మాస్ మహారాజ్ కొత్త బిజినెస్.. ఫ్యాన్స్ ఇకనుండి అక్కడే!

RaviTeja: మాస్ మహారాజ్ కొత్త బిజినెస్.. ఫ్యాన్స్ ఇకనుండి అక్కడే!

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)కు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ అంటే బస్ పాస్ కాదు.. అని పవర్ సినిమాలోని డైలాగ్ ఆయనకి పక్కాగా సరిపోతుంది. అందుకే రవితేజ సినిమాలు కూడా ఎక్కువగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు. సినిమాల్లో ఆయన డైలాగ్స్, మ్యానరిజమ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి సపోర్ట్ అండ్ బ్యాగ్రౌంగ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ స్థాయికి ఎదిగిన రవితేజ ప్రయాణం ఎందరికో ఆదర్శం. 

అయితే చిన్నప్పటి నుండి రవితేజకి సినిమాలన్నా, నటన అన్నా పిచ్చి. అందుకే అంత పెద్ద స్టార్ అయినప్పటికి సినిమాలు తప్పా వేరే వ్యాపారంలోకి దిగలేదు రవితేజ. కానీ, తాజాగా సమాచారం ప్రకారం కెరీర్ లో మొదటిసారి వ్యాపార రంగంలోకి దిగుతున్నారు రవితేజ. అది కూడా ఎసియన్ సంస్థతో కలిసి. ఏఆర్టీ(ART) పేరుతో హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో 6 స్క్రీన్ లతో భారీ మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించానున్నారట. త్వరలోనే ఈ మల్టీ ప్లెక్స్ ఓపెన్ కానుందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాల్లోనే కాదు.. థియేటర్స్ బిజినెస్ లో కూడా విజయం సాధించాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ, హరీష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.