అక్టోబర్ 21న ‘ధమాకా’ టీజర్

అక్టోబర్ 21న   ‘ధమాకా’ టీజర్

కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసి ముప్ఫయేళ్లు దాటినా సూపర్ స్పీడ్‌‌‌‌‌‌‌‌తో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో  ‘ధమాకా’ మూవీ ఒకటి. నక్కిన త్రినాథరావు దర్శకుడు. శ్రీలీల హీరోయిన్​. జయరామ్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. దసరా రోజున మరో అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అక్టోబర్ 21న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

దీపావళి సందర్భంగా మాస్ క్రాకర్ రెడీ చేస్తున్నట్టు తెలిపారు.‘డబుల్ ఇంపాక్ట్’ అనే క్యాప్షన్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవితేజ మాస్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్ర్కీన్‌‌‌‌‌‌‌‌ప్లే, మాటలు రాస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను కూడా అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు.