15న ధమాకా ట్రైలర్

15న  ధమాకా ట్రైలర్

మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ రవితేజ. ఆయన నుంచి రాబోతోన్న మరో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. డిసెంబర్ 23న  సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే  పాటలను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ నెల 15న ట్రైలర్ విడుదల చేయనున్నట్టు రవితేజ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు.

ఇందులో రవితేజ స్పెట్స్ పెట్టుకుని, సూట్ వేసుకుని సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తూ, స్టైలిష్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో క్లాస్ , మాస్ గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవితేజ డ్యూయెల్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా గ్యారెంటీ అంటున్నారు మేకర్స్. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, మాటలు రాస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్.