రవితేజ ఫ్యాన్స్కు కిక్కే కిక్కు.. రీ రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ మూవీ

రవితేజ ఫ్యాన్స్కు కిక్కే కిక్కు.. రీ రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ మూవీ

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కెరీర్ లో ఎన్ని బెస్ట్ సినిమాలున్నా కిక్(kick) సినిమాకున్న ప్రత్యేకత వేరు. టాలీవుడ్ స్టైలీష్ మేకర్ సురేందర్ రెడ్డి(Surender reddy) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 2009లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో రవితేజ ఇచ్చిన కిక్కుకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్ లో కూడా కిక్ సినిమా క్రూషియల్ రోల్ పోషించింది. అప్పటివరకు ప్లాప్స్ తో ఉన్న సురేందర్ రెడ్డికి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. 

అలాటి సినిమా ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ కాబోతోంది. మార్చ్ 1న ఈ సినిమా రీ రిలీజ్ కానుందని సమాచారం. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్బంగా కిక్ సినిమా రీ రిలీజ్ ప్రకటన చేశారు మేకర్స్. దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడి సూపర్ హిట్ సినిమాతో మరోసారి కిక్ ఎక్కించబోతున్నారు. ఇప్పటికే రవితేజ వెంకీ సినిమా రీ రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. మరి కిక్ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి. 

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఈగల్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.