RT76 Title: భలే గమ్మత్తయిన టైటిల్తో.. కిషోర్ తిరుమల-రవితేజ మూవీ..

RT76 Title: భలే గమ్మత్తయిన టైటిల్తో.. కిషోర్ తిరుమల-రవితేజ మూవీ..

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ  సినిమాస్ బ్యానర్‌‌‌‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇపుడు ఈ టైటిల్ రివీల్ అవ్వడంతో భలే గమ్మత్తయిన టైటిల్ అంటూ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

టైటిల్ వినడానికి కాస్త వింతగా ఉండటంతో రవితేజకు ఇది బాగా నచ్చిందని టాక్. ఆ వెంటనే రిజిస్టర్ చేయమని నిర్మాతలను కోరారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదనంగా, మేకర్స్ మరో ప్రత్యామ్నాయ టైటిల్‌ను సైతం ఎంచుకున్నారని టాక్ కూడా ఉంది.

ఇందులో రవితేజ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌‌‌‌తో కూడిన ఫుల్ లెంగ్త్  ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తున్నాడు. రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 75వ చిత్రం. ప్రస్తుతం వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ మూవీలో లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషనల్ హీరోయిన్లు కయాదు లోహర్, మమిత బైజు హీరోయిన్లుగా నటించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

ఇకపోతే,ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

►ALSO READ | Theatre Releases: ఆడియన్స్ను థియేటర్స్కి రప్పించే కథలతో.. డిఫరెంట్ జోనర్లలో మూడు సినిమాలు

మరోవైపు ప్రస్తుతం రవితేజ నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘మాస్ జాతర’. సామజవరగమన రైటర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వినాయక చవితికి విడుదల కావాల్సిన  ఈ సినిమా ఇటీవలే వాయిదా పడింది.

లేటెస్ట్గా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 31న ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.  ఈ రిలీజ్ డేట్‌‌‌‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రానుందని తెలుస్తోంది.

రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 75వ చిత్రం. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.