పండక్కి ‘రావణాసుర’ ప్రారంభం

పండక్కి ‘రావణాసుర’ ప్రారంభం

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంలో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. గ్యాప్‌‌‌‌ తీసుకోకుండా ఒకేసారి మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్‌‌‌‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో సుధీర్ వర్మ రూపొందిస్తున్న ‘రావణాసుర’ ఒకటి. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌‌లో అనౌన్స్ చేసిన ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఇందులో రవితేజ లాయర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. ఇది రవితేజకి 70వ సినిమా.  శ్రీకాంత్ విస్సా రాసిన ఈ కథలో  రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపిస్తానంటున్నాడు సుధీర్ వర్మ. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా రివీల్ చేయలేదు. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ నటించిన ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న, ‘రామారావు ఆన్ డ్యూటీ’ మార్చి 25న రిలీజ్‌‌‌‌ కానున్నాయి. వీటితో పాటు ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు కమిట్‌‌‌‌అయ్యాడు.