ఆరేళ్ళ తర్వాత కలిసి వస్తున్నారు.. మరోసారి ఆసీస్ ని వణికిస్తారా..?

ఆరేళ్ళ తర్వాత కలిసి వస్తున్నారు.. మరోసారి ఆసీస్ ని వణికిస్తారా..?

టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఎంత విజయవంతమైన కాంబినేషన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ  కలిస్తే ఎంత ప్రమాదమో ప్రత్యర్థికి బాగా తెలుసు. ఓ వైపు వైవిధ్యంతో అశ్విన్, మరోవైపు దూస్రాలతో జడ్డూ బ్యాటర్లకు పీడకలనే మిగిల్చారు. ఇక తాజాగా వీరిద్దరూ మరోసారి కలవనున్నారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వీరిద్దరూ కలిసి కంగారులను కంగారు పెట్టేందుకు సిద్ధం అయిపోయారు.

ఆరేళ్ళ తర్వాత వచ్చినా.. ఆసీస్ కి కష్టమే

ప్రస్తుతం టీమిండియాలో జడేజా రెగ్యులర్ ప్లేయర్. కానీ అశ్విన్ మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్ లో చోటు కోల్పోయి చాలా కాలం అయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా అక్షర్ పటేల్ గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్. పైగా వచ్చే నెలలో స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భారత యాజమాన్యం భావిస్తుంది. ఈ  క్రమంలో ఆసీస్ తో మూడు వన్డేలు అశ్విన్ కి కీలకంగా మారాయి.

ALSO READ : IND vs AUS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆ ముగ్గురి పైనే అందరి చూపు

 
జట్టులో జడేజా ఎలాగూ ఉంటాడు కాబట్టి అశ్విన్ జడ్డూకి జత కలిస్తే ఒకప్పటి వీరిద్దరి జోడీని మరోసారి మ్యాజిక్ చేయడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. పైగా వీరిద్దరికీ ఆసీస్ పై గ్రేట్ రికార్డ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్పిన్ ద్వయం ఆసీస్ ని ఏ మాత్రం కంగారు పెడతారో చూడాలి.