ఐపీఎల్‌లో కరోనా టెన్షన్.. లీగ్‌‌ నుంచి తప్పుకున్న అశ్విన్

ఐపీఎల్‌లో కరోనా టెన్షన్.. లీగ్‌‌ నుంచి తప్పుకున్న అశ్విన్
  •     ఆర్​సీబీ క్రికెటర్లు జంపా, కేన్​ రిచర్డ్‌‌సన్ ఇంటికి
  •     ఇక్కడి పరిస్థితులపై కంగారూ ప్లేయర్ల ఆందోళన
  •     టోర్నీ  కొనసాగుతుందని  బీసీసీఐ స్పష్టం 


న్యూఢిల్లీ: సాఫీగా సాగుతున్న ఐపీఎల్–14లో సోమవారం ఒక్కసారిగా కలకలం రేగింది. టీమిండియా ఆఫ్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​తోపాటు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆడమ్​ జంపా, కేన్​ రిచర్డ్​సన్​లీగ్​నుంచి తప్పుకున్నారు. దీంతో మిగిలిస సీజన్​ సక్రమంగా జరగడంపై సందేహాలు మొదలయ్యాయి. కానీ ఎంతమంది ప్లేయర్లు లీగ్​కు దూరంగా ఉన్నా సరే..టోర్నీ అనుకున్న ప్రకారం జరుగుతుందని బీసీసీఐ తేల్చిచెప్పింది. అశ్విన్​ ఐపీఎల్–14లో ఢిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్నాడు. అయితే, తన ఫ్యామిలీ, బంధువులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారని, వారికి సపోర్ట్​గా ఉండేందుకు ఇంటికి వెళ్తున్నట్టు ఆదివారం సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ ముగిసి న వెంటనే అశ్విన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశాడు.  పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి లీగ్​లో బరిలోకి దిగుతానని చెప్పాడు. అశ్విన్‌‌‌‌ ఫ్యామిలీలో ఒకరికి కరోనా సోకినట్టు సమాచారం. కాగా,  రాయల్​చాలెంజర్స్​ బెంగళూరు ప్లేయర్లు ఆడమ్​ జంపా, కేన్​ రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌ పర్సనల్ రీజన్స్‌‌‌‌తో లీగ్​నుంచి విత్​ డ్రా అయ్యారు. జంపాను రూ.1.5 కోట్లుకు కొనుగోలు చేసిన ఆర్​సీబీ.. రిచర్డ్​సన్​ కోసం రూ.4 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ సీజన్​లో రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌ ఒక మ్యాచ్​లో బరిలోకి దిగాడు. జంపాకు అవకాశం రాలేదు. ఇద్దరు ఆసీస్​ తిరిగి వెళ్లారు. కాగా, రాజస్తాన్​ రాయల్స్​, ఆస్ట్రేలియా ప్లేయర్​ ఆండ్రూ టై ఆదివారమే జట్టును వీడాడు. ఇండియాలో పరిస్థితులు అదుపు తప్పాయని, ఇలాగే కొనసాగితే ఇప్పట్లో తిరిగి ఇంటికి వెళ్లమనే లీగ్​ను వీడుతున్నట్టు టై చెప్పాడు.  ఇలా ఒకరి తర్వాత ఒకరు ఫారిన్​ క్రికెటర్లు తప్పుకుంటున్నా లీగ్​కు వచ్చిన ముప్పు ఏమీ లేదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. లీగ్‌‌‌‌ను విడిచి వెళ్లాలనుకుంటే అది ప్లేయర్ల ఇష్టమన్నారు. 

మా ప్లేయర్లు టెన్షన్‌‌‌‌ పడుతున్నారు: హస్సీ  

ఇండియాలో పరిస్థితిని చూసి లీగ్​లో ఉన్న ఆసీస్​ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని కోల్​కతా నైట్​రైడర్స్​ మెంటార్​ డేవిడ్​ హస్సీ అన్నాడు. ‘తిరిగి ఆస్ట్రేలియా వెళ్లగలమా లేదా అని ప్లేయర్లంతా టెన్షన్​లో ఉన్నారు. లీగ్​లో మిగిలిన ఆసీస్​ క్రికెటర్లలో మరికొందరు కూడా స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారు’ అని ఆసీస్​ మాజీ క్రికెటర్​ హస్సీ తెలిపాడు. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి వెళ్లడం కంటే బయో బబుల్​లో ఉండటమే సేఫ్​ అని  ముంబై ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్​ పేసర్​ కూల్టర్​నైల్​ అన్నాడు. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్​ కోచ్​, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​ ఈ అంశంపై స్పందించాడు. ‘ఐపీఎల్​ బయోబబుల్​ అవతల పరిస్థితులపై అవగాహన ఉంది. కానీ లీగ్​ కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. మరోవైపు ప్లేయర్లతోపాటు తమ దేశానికి చెందిన కామెంటేటర్స్​తో నిరంతరం టచ్​లో ఉంటున్నామని క్రికెట్​ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్స్​ అసోసియేషన్​ సోమవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఐపీఎల్​లో ప్రస్తుతం 14 మంది ఆస్ట్రేలియన్లు మిగిలారు. ​ వార్నర్,  స్మిత్, కమిన్స్​, కోచ్​లు పాంటింగ్, సైమన్​ కటిచ్​తోపాటు పలువురు లీగ్​లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​ నేపథ్యంలో న్యూజిలాండ్​ ప్లేయర్లు కేన్​ విలియమ్సన్​, ట్రెంట్​ బౌల్ట్​ లీగ్ నుంచి కాస్త ముందుగానే స్వదేశానికి వెళ్లనున్నారు. క్వారంటైన్​ రూల్స్​ నేపథ్యంలో వీళ్లు లీగ్​ చివరి దశలో ఐపీఎల్​బబుల్​ను వీడనున్నారు.