న్యూఇయర్‌‌కు న్యూవేవ్ వస్తోంది

న్యూఇయర్‌‌కు న్యూవేవ్ వస్తోంది

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కొడుకు రోషన్  హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్‌‌గమ్’.  క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పెరేపు దీన్ని రూపొందిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మానస చౌదరి హీరోయిన్‌‌. రీసెంట్‌‌గా ఈ మూవీ ఫస్ట్‌‌లుక్ పోస్టర్‌‌‌‌ను రాజమౌళి లాంచ్ చేయగా, మంగళవారం టీజర్‌‌‌‌ను నాని రిలీజ్ చేశాడు. 

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌మీట్‌‌లో నాని మాట్లాడుతూ ‘టీజర్ చూస్తుంటేనే రోషన్ బాగా చేశాడనే ఫీలింగ్ వచ్చింది. తొలి సినిమాకే చాలా యీజ్‌‌తో చేశాడు.  స్క్రీన్ మీద పర్ఫెక్ట్‌‌గా కనిపించాడు. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఇది గ్రేట్ డేట్. న్యూ ఇయర్, న్యూ వేవ్ రాబోతుంది ఇండస్ట్రీలోకి. ఆ రోజు బ్లాక్ బస్టర్ సక్సెస్‌‌ని సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నాడు. 

రోషన్ మాట్లాడుతూ ‘నాకు ఇష్టమైనది చేయడానికి ప్రోత్సహించిన అమ్మనాన్నలకి థ్యాంక్స్. తాత, నాన్నమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది’ అన్నాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది మానస. ‘ఈ సినిమాకి యంగ్ టాలెంట్ పని చేశారు. రోషన్, మానస చాలా గ్రేస్‌‌తో పాత్రలని పోషించారు’ అని  చెప్పాడు  రవికాంత్. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. రాజీవ్ కనకాల సహా టీమ్ అంతా పాల్గొన్నారు.