పంత్,జడేజా రికార్డు భాగస్వామ్యం

 పంత్,జడేజా రికార్డు భాగస్వామ్యం

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్లో టీంఇండియా అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. 98 పరుగులుకే 5 కీలక వికెట్లు కోల్పయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు కలిసి 239 బంతుల్లో 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఇది టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్లో ఇండియాకు అత్యధిక ఆరో వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం.  1997లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ , మహ్మద్ అజారుద్దీన్‌లరికార్డును వీరిద్దరూ సమం చేశారు. ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టెస్టు క్రికెట్‌లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో ఐదు విదేశీ గడ్డ పైనే కావడం విశేషం. అటు జడేజా 163 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ప్రస్తుతం క్రీజ్లో జడేజాతో పాటుగా మహ్మద్ షమీ ఉన్నాడు.