
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజా సింగ్.. నేటి యువతకు సందేశం ఇచ్చే సినిమా ఇది అన్నారు.
Also Rard: వరల్డ్ కప్‌లో ఎలావెనిల్‌కు గోల్డ్
ఇలాంటి గొప్ప సినిమాలో నటించడం గర్వంగా ఉందని చెప్పింది హీరోయిన్ అనిష్క త్రిపాఠి. సెప్టెంబర్ 17న జరిగిన విముక్తి పోరాటం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు దర్శకుడు యాటా సత్యనారాయణ. మంచి మెసేజ్‌తో పాటు ఈనాటి యువతకు మన చరిత్ర తెలియజేసేలా సినిమా ఉంటుంది అని నిర్మాత నారాయణ రెడ్డి అన్నారు.