
బ్యాంకులకు దాస్ సూచన
ముంబై : ఆస్తులు–అప్పుల మధ్య వ్యత్యాసం ఎక్కువవుతుంటే జాగ్రత్తపడాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం హెచ్చరించారు. ఆస్తులు ఎక్కువైనా, అప్పులు ఎక్కువైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఇబ్బందికరమేనని ఆయన చెప్పారు. అమెరికాలోని తాజా బ్యాంకింగ్ సంక్షోభానికి ఇదే కారణమని పరోక్షంగా పేర్కొన్నారు.
శక్తికాంత దాస్ కొచ్చిలో ఫెడరల్ బ్యాంక్ ఫౌండర్ కే పీ హోర్మిస్ యాన్యువల్ మెమోరియల్ ఉపన్యాసం చేశారు. మన ఫైనాన్షియల్ సెక్టార్ నిలకడగానే ఉందని, ఇన్ఫ్లేషన్ భయాలు తగ్గినట్లేనని కూడా దాస్ చెప్పారు.