బ్యాంకు వడ్డీరేట్లు తగ్గుతాయా?

బ్యాంకు వడ్డీరేట్లు తగ్గుతాయా?

అందరూ ఊహించినట్టు గానే భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్‌ బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్థిక వ్యవస్థకు మరిం త ఊపునివ్వడానికి రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఇది ఆరు శాతానికి తగ్గింది. మిగిలిన అంశాలను యథాతథంగా కొనసాగించాలని (న్యూట్రల్‌ స్టాన్స్‌ ) నిర్ణయించిం ది. వారం రోజుల్లోపార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నిర్ణయాన్ని ప్రకటించిం ది. రెపోరేటు తగ్గింపు వల్ల ఇళ్ల, వాహన,వ్యక్తిగత రుణాలపై వడ్డీలు తగ్గుతాయి. అయితేడిపాజిట్లపై వడ్డీమొత్తాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. వాణిజ్యబ్యాంకులకు ఆర్‌ బీఐ ఇచ్చేస్వల్పకాలిక అప్పులపై వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అంటారు. ఆర్‌ బీఐ తాజా నిర్ణయం వల్ల రివర్స్‌ రెపోరేటు 5.75 శాతానికి చేరిం ది. ఆర్‌ బీఐ మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రేట్ల తగ్గింపునకు అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆర్‌ బీఐ ఈసారి వడ్డీరేట్లను తగ్గించే చాన్స్‌ ఉందని పలు సర్వేల్లో ఆర్థిక నిపుణులు చెప్పారు .

జీడీపీ అంచనాలు తగ్గింపు….

జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ఆర్‌ బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదవుతుందనిఆర్బీఐ అంచనా వేసింది. తొలి ఆరు నెలల్లో ఆర్థికవృద్ధి 6.8–7.1 శాతం, మిగతా ఆరు నెలల్లో ఇది .3–7.4 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. ఫిబ్రవరి నెలలో సమీక్ష సందర్భంగా ఇది 7.4 శాతం ఉండొచ్చని ప్రకటించిం ది. గత కొన్ని నెలలుగా అంతర్జా తీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని తెలిపింది. ‘‘ప్రొడక్షన్‌‌, కాపిటల్‌ గూడ్స్‌ ఎగుమతులు తగ్గినందున దేశీయంగానూ పెట్టు బడుల వాతావరణం ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు.అంతర్జా తీయంగా ప్రతికూల వృద్ధి ఇండియా ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్రెగ్జిట్‌ వల్ల ఇంగ్లండ్‌‌ ఆర్థిక వ్యవస్థ మందగించిం ది. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. అమెరికాతోపాటు ఇతరసంపన్న దేశాలు వడ్డీరేట్ల పెరుగుదలకే మొగ్గుచూపుతున్నాయి . ఉత్పత్తి తగ్గించడం వల్ల చమురు ధరలు పెరుగు తూనే ఉన్నాయి . ఇది ఇండియా ఆర్థిక వ్యవస్థకు, రూపాయి విలువకు ఇబ్బందిగా మారుతుంది. అయితే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉండొచ్చు’’ అని ఆర్‌ బీఐ పేర్కొంది. గత ఏడాది అక్టోబరు–డిసెంబరు క్వార్టర్‌ లో జీడీపీ 6.6శాతం నమోదయింది.

ద్రవ్యోల్బణంపై సానుకూలం…

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉండొచ్చని తెలిపింది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌ లో 2.4 శాతం నమోదు కావొచ్చని ప్రకటించిం ది. ఈ నెల ఒకటో తేదీతో మొదలైన ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 2.9–3.0శాతం, మిగిలిన ఆరు నెలల్లో 3.5–3.8 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 2.57 శాతం నమోదయింది. జనవరిలో 19 నెలల కనిష్టం 1.9 శాతంమాత్రమే నమోదయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌ బీఐ రెపోరేటును తగ్గించినప్పుడు బ్యాంకులుఎంసీఎల్‌ ఆర్‌ ను కొద్దిగా తగ్గించాయి. దీన్ని మరింత తగ్గించాలని ఆర్బీఐ కోరుతోంది.