బాంబులు పెట్టామని మెయిల్ చేసింది.. ఈ వడోదర వెధవే

బాంబులు పెట్టామని మెయిల్ చేసింది.. ఈ వడోదర వెధవే

ముంబైలోని ఆర్బీఐ, హెచ్​డీఎఫ్​సీ కార్యాలయాల్లోబాంబులు పెట్టినట్టు ఆర్బీఐకి మెయిల్ పంపిన ఘటనలో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వడోదరకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం బెదిరింపు మెయిల్ పంపిన ఉద్దేశం వెనుక ఉన్న కారణాలపై నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నిస్తోంది.

ALSO READ:-అందుకే చెప్పేది.. చదువుకోండి ఫస్ట్.. మదర్సా స్టూడెంట్ అరెస్ట్

అంతకుముందు ముంబైలోని 11 చోట్ల 11 బాంబులు అమర్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో పాటు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు భారతదేశంలో ఓ అతిపెద్ద కుంభకోణంలో ప్రమేయం కలిగి ఉన్నారని పేర్కొంటూ, వారు రాజీనామా చేయాలని మెయిల్ లో డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్‌బీఐ కార్యాలయాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా 11 చోట్ల 11 బాంబులు అమర్చామని మెయిల్‌లో పేర్కొన్నారు.