అందుకే చెప్పేది.. చదువుకోండి ఫస్ట్.. మదర్సా స్టూడెంట్ అరెస్ట్

అందుకే చెప్పేది.. చదువుకోండి ఫస్ట్.. మదర్సా స్టూడెంట్ అరెస్ట్

సోషల్ మీడియా వచ్చాక ఫేమస్ అవ్వాలని, తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనే ఆశ, కోరిక చాలా మందికి పెరిగిపోయింది. అందుకు ఏమైనా చేస్తున్నారు. దేన్నీ లెక్క చేయడం లేదు. చదువుకోవాల్సిన వయసులో అవాంఛిత లేదా దేశానికి హాని కలిగించే పోస్టులు పెట్టి పాపులర్ అవడం ఈ రోజుల్లో ఫ్యాషనైపోయింది. అదే తరహాలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో మరో 'పుల్వామా తరహా ఉగ్రదాడి' జరగబోతోందంటూ ఓ పోస్టు చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో.. ఆ వార్త పోలీసులకు చేరింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

ALSO READ:-లోకం తీరు.. ఓ పక్క ప్రాణాలు పోతుంటే.. మరోపక్క దారి దోపిడీ చేశారు

ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన ఈ ఘటనలో పోస్ట్ చేసిన బాలిక ఒక మదర్సా విద్యార్థినిని గుర్తించారు. బెదిరింపులను పోలేలా ఈ పోస్ట్‌ ఉండడంతో ఆమె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఆ పోస్ట్ ఎందుకు చేసింది, దీని వెనక ఏదైనా బలమైన కారణమేమైనా ఉందన్న రీతిలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఎంతకైనా మంచిది భద్రతా బలగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. గతంలో ఒక X యూజర్ యూపీ పోలీసులను ట్యాగ్ చేసి, 'పుల్వామా లాంటి ఉగ్రవాదం' ముప్పు గురించి హెచ్చరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మహ్మద్ తల్హా మజార్‌గా గుర్తించబడిన ఈ నిందితుడు తన సోషల్ మీడియా పోస్ట్‌లో "ఇన్షా అల్లాహ్, త్వరలో రెండవ పుల్వామా జరుగుతుంది" అని రాశాడు. వెంటనే రంగంలోకి దిగిన సహరాన్‌పూర్ పోలీసులు నిందితులను దేవ్‌బంద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని సహరాన్‌పూర్ ఎస్‌ఎస్పీ డాక్టర్ విపిన్ తడా తెలిపారు.