ఆర్​బీఐ ఎంపీసీ...రెపో రేటు మారుస్తారా..?

ఆర్​బీఐ ఎంపీసీ...రెపో రేటు మారుస్తారా..?

 ముంబై:  ఆర్​బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్​ మంగళవారం మొదలైంది.  గురువారం నాడు పాలసీ రేటు నిర్ణయాన్ని ఆర్​బీఐ గవర్నర్​ వెల్లడిస్తారు. ఇన్​ఫ్లేషన్​ దిగిరావడంతో, గ్రోత్​కి ఊతమిచ్చేలా రెపో రేటును ఈసారి మార్చకుండా 6.5 శాతం వద్దే కొనసాగిస్తారని మార్కెట్​ అంచనా వేస్తోంది.

ఎంపీసీ మీటింగ్ ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నాయకత్వంలో జరుగుతుండగా,  ఆరుగురు మెంబర్లు పాల్గొంటున్నారు. ఏప్రిల్​ నెలలో రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ 4.7 శాతానికి దిగిపోయింది. మే నెలలో ఇది మరింత తగ్గే ఛాన్స్​ ఉందని శక్తికాంత దాస్​ ఇటీవలే సూచనప్రాయంగా తెలిపారు. మే నెల ఇన్​ఫ్లేషన్​ గణాంకాలను ఈ నెల 12 న ప్రకటించనున్నారు.