
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 7.2 శాతం
- రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 4.5 శాతం: ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రెండో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో కూడా వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చలేదు. కీలకమైన రెపో రేటు 6.5 శాతం దగ్గరే కొనసాగించాలని ఆరుగురు మెంబర్లున్న ఎంపీసీలో నలుగురు ఓటేశారు. అలానే ‘విత్‌డ్రాయల్ ఆఫ్ అకామిడేషన్’ వైఖరిని కొనసాగించేందుకు మొగ్గు చూపారు. అంటే ఎకానమీకి అందిస్తున్న స్టిమ్యులస్‌ను నెమ్మదిగా తగ్గించడం. కిందటేడాది జూన్ నుంచి విత్‌డ్రాయల్ ఆఫ్ అకామిడేషన్‌ను ఆర్‌బీఐ అమలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం పెరుగుతుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది.
గతంలో వేసిన 7 శాతం నుంచి పెంచింది. మరోవైపు రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 4.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇన్‌ఫ్లేషన్ అంచనాలను ఆర్‌బీఐ ఎంపీసీ మార్చలేదు. ఆహార పదార్థాల ధరలు పెరుగుతుండడంతో ఇన్‌ఫ్లేషన్ తగ్గడం లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వాతావరణ శాఖ అంచనా వేసినట్టు ఈసారి వర్షాలు సాధారణంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లేషన్ దిగొస్తుందని అన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 4.5 శాతంగా రికార్డవుతుంది. మొదటి క్వార్టర్‌లో 4.9 శాతంగా, సెకెండ్ క్వార్టర్‌లో 3.9 శాతంగా, థర్డ్ క్వార్టర్‌లో 4.6 శాతంగా, ఫోర్త్ క్వార్టర్‌లో 4.5 శాతంగా నమోదవుతుంది’ అని వివరించారు.
ఎంపీసీ మీటింగ్‌లోని మరిన్ని అంశాలు..
1. బల్క్‌గా ( పెద్ద మొత్తంలో) చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల లిమిట్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు ఆర్‌బీఐ ఎంపీసీ పెంచింది. బ్యాంకుల అసెట్స్ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
2. ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ సులభమవుతుండడంతో ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్‌పై ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్) గైడ్‌లైన్స్‌ను రేషనలైజ్ చేయాలని ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయించింది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుందని, ఆథరైజ్డ్ బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగించడం సులభమవుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలో డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను ప్రకటిస్తామని దాస్ అన్నారు.
3. డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. డిజిటల్ పేమెంట్స్ సంస్థల మధ్య డేటా షేరింగ్‌కు ఇది సాయపడుతుంది.
4. యూజర్ల యూపీఐ లైట్ వాలెట్లు ఆటోమెటిక్‌గా నిండేందుకు కొత్త ఫెసిలిటీని ఆర్‌బీఐ తీసుకురానుంది. ప్రస్తుతం యూపీఐ లైట్ వాలెట్ రోజువారి లిమిట్ రూ.2 వేలు. ఒక పేమెంట్‌లో గరిష్టంగా చేసే అమౌంట్ రూ.500.
చివరి 6 నెలల్లో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు!
వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆర్‌బీఐ ఫోకస్ పెట్టాలని రియల్ ఎస్టేట్ డెవలపర్లు చెబుతున్నారు. హోమ్ లోన్లపై వడ్డీ భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ మంచి గ్రోత్ నమోదు చేసిందని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బోమన్ ఇరాని అన్నారు. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 నెలల గరిష్టానికి తగ్గిందని, రానున్న ఎంపీసీ మీటిం గ్‌లో వడ్డీ రేట్లను తగ్గించాలని సలహా ఇచ్చారు. ఇన్‌ఫ్లేష న్ మరింత తగ్గితే ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో రెపో రేటును ఆర్‌బీఐ 25-50 బేసిస్ పాయింట్లు తగ్గించనుందని ఎకనామిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.