లోన్​ యాప్స్‌ను కట్టడి చేయాల్సిందే

లోన్​ యాప్స్‌ను కట్టడి చేయాల్సిందే
  • ఆర్బీఐ వర్కింగ్​ గ్రూప్​

వెలుగు బిజినెస్​ డెస్క్​: అప్పులిచ్చే యాప్స్​ను కట్టడి చేయాల్సిందేనని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) కమిటీ సూచించింది. వాటి పూర్తి వివరాలు వెరిఫై చేసేందుకు ఒక నోడల్​ ఏజన్సీ, ఇల్లీగల్​ లెండింగ్​ ఆపేందుకు తగిన చట్టం తేవాలని అభిప్రాయపడింది. మొబైల్​ యాప్స్​ ద్వారా అప్పులిస్తూ  కస్టమర్లను వేధింపులకు గురి చేయడాన్ని అరికట్టేందుకు  ఈ చర్యలని పేర్కొంది. ఫిన్​టెక్​ రంగంలో ఇనొవేషన్​ను ఎంకరేజ్​ చేస్తూనే, అక్రమాలకు పాల్పడకుండా తగిన పద్ధతులు తేవాలని తెలిపింది. 

డిజిటల్​గా అప్పులిచ్చే ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​, మొబైల్ యాప్స్​ కార్యకలాపాలను స్టడీ చేసేందుకు ఆర్​బీఐ ఈ వర్కింగ్​ గ్రూప్​ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో ఏర్పాటయిన వర్కింగ్​ గ్రూప్​కు ఆర్​బీఐ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ జయంత్​ కుమార్​ దాస్​​  నాయకత్వం వహించారు. ఇచ్చిన అప్పుల వసూళ్లకు బలవంతపు చర్యలకు  డిజిటల్​ లెండింగ్​ కంపెనీలు దిగుతున్నాయనే ఆరోపణలు రావడంతో వర్కింగ్​ గ్రూప్​ను నియమించారు. మొబైల్​ యాప్స్​ కంపెనీల టెక్నలాజికల్​ క్రెడెన్షియల్స్​ను, వాటికి అప్పులిస్తున్న కంపెనీలను, సర్వీస్​ ప్రొవైడర్లను వెరిఫై చేసేందుకు ఒక నోడల్​ ఏజన్సీ ఉండాలని ఆర్​బీఐ వర్కింగ్​ గ్రూప్​ తేల్చింది. తాము వెరిఫై చేసిన మొబైల్​ యాప్స్​ వివరాలను వెబ్​సైట్​లోనూ ఆ నోడల్​ ఏజన్సీ ఉంచాలని సూచించింది. మన దేశంలోని యాండ్రాయిడ్​ యూజర్లకు అప్పులిచ్చే మొబైల్​ యాప్స్ ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య కాలంలో​ 1,100 దాకా ఉన్నట్లు వర్కింగ్​ గ్రూప్​ లెక్కకట్టింది. ఇందులో 600 యాప్స్​ ఇల్లీగలేనని తేల్చింది.  బాలెన్స్​ షీట్​ లెండింగ్​ను కట్టడి చేసేందుకు కూడా తగిన రెగ్యులేషన్​ ఉండాలని వర్కింగ్​ గ్రూప్​ వెల్లడించింది. ఎన్​బీఎఫ్​సీలు లేదా వేరే ఏదైనా కంపెనీల నుంచి డబ్బును తెచ్చుకుని, ఆ డబ్బును కస్టమర్లకు మొబైల్​ యాప్స్​ అప్పులుగా ఇస్తున్నాయి.   ఎక్కడి నుంచి ఎవరికి ఎలా డబ్బులు వెళ్తున్నాయనేది  తెలియడం లేదని వర్కింగ్​ గ్రూప్​ పేర్కొంది. కాబట్టి అన్​ రెగ్యులేటెడ్​ లెండింగ్​ యాక్టివిటీస్​ జరగకుండా చూసేందుకు ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరింది.