కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవలపై RBI ఆంక్షలు

కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవలపై RBI ఆంక్షలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్ లైన్ సేవలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు 2024, ఏప్రిల్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. 

కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్ లైన్ సేవలకు సంబంధించి.. కొత్తగా ఎలాంటి క్రెడిట్ కార్డులు జారీ చేయటానికి వీల్లేదు. మొబైల్ బ్యాంకింగ్ సేవల కింద.. కొత్త కస్టమర్లను ఆన్ బోర్డ్ చేయకూడదని ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఆర్బీఐ ఆంక్షలు ఎందుకు..?

కొటాక్ మహీంద్రా బ్యాంక్ గత రెండు సంవత్సరాలుగా.. అంటే 2022, 2023 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నరెన్స్, ఐటీ రిస్క్ కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది ఆర్బీఐ. వరసగా రెండేళ్లపాటు ఈ లోపాలు బయటపడటంతో ఆంక్షలు విధించింది.ఆన్లైన్ ద్వారా కస్టమర్లను తీసుకోవటం, ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను జారీ చేయటాన్ని నిలిపివేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Also Read:వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

2024, ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉన్న కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. యథావిధిగా లావాదేవీలు కొనసాగించవచ్చని.. వారి సేవలకు మామూలుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొత్త ఖాతాదారులను చేర్చుకోవటంపైనే ఆంక్షలు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఉన్న ఖాతాదారులకు సంబంధించిన సేవలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్బీఐ.

2020 హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు పైన కూడా ఇలాంటి ఆంక్షలే విధించింది ఆర్బీఐ. HDFC బ్యాంక్ ఎలాంటి కొత్త డిజిటల్ సేవలు అనుమతించరాదని, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.