మార్కెట్లకు బూస్ట్…రివర్స్ రెపో రేటు కోత

మార్కెట్లకు బూస్ట్…రివర్స్ రెపో రేటు కోత

న్యూఢిల్లీ:కరోనా వైరస్‌‌‌‌ నుంచి ఎకానమీని కాపాడేందుకు ప్రభుత్వంతో పాటు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు లిక్విడిటీ బూస్టప్ చర్యలు ప్రకటిస్తూ.. ఎకానమీకి, మార్కెట్లకు అండగా నిలుస్తోంది. మూడు వారాల వ్యవధిలోనే రెండోసారి కీలక  రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో అప్పులిచ్చేందుకు బ్యాంక్‌‌‌‌ల వద్ద మరింత లిక్విడిటీ ఉంటుంది. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అంతకుముందు ఈ రేటు 4 శాతంగా ఉన్నట్టు తెలిపారు. రివర్స్ రెపో రేటు అంటే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వద్ద బ్యాంక్‌‌‌‌లు ఉంచిన నగదుకు చెల్లించే వడ్డీరేటు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రివర్స్ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో, కమర్షియల్ బ్యాంక్‌‌‌‌లు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వద్ద నగదు ఉంచేందుకు అంత ఆసక్తి చూపించవు. దీంతో బ్యాంక్‌‌‌‌ల వద్ద మనీ ఎక్కువగా ఉండి, లోన్లు ఇచ్చేందుకు మొగ్గుచూపుతారు. ఇక రెపో రేటు నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) చూసుకుంటుందని తెలిపారు. మరోసారి రేటు కోతలుంటాయని దాస్ సంకేతాలిచ్చారు. షాడో బ్యాంక్‌‌‌‌లు అంటే ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు, మైక్రోఫైనాన్స్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ ఎదుర్కొంటోన్న లిక్విడిటీ సంక్షోభాన్ని తగ్గించేందుకు రూ.50 వేల కోట్ల లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్(ఎల్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ఓ 2.)ను చేపడుతున్నట్టు దాస్ తెలిపారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇలా మీడియా సమావేశం నిర్వహించడం  నెల రోజులలో ఇది రెండోసారి. ఫైనాన్షియల్ సిస్టమ్‌‌‌‌కు అవసరమైన మనీని ఉంచేందుకు, బ్యాంక్‌‌‌‌లకు క్రెడిట్ ఫ్లో సరిగా ఉండేందుకు, ఫైనాన్సియల్ మార్కెట్లు స్థిరంగా కార్యకలాపాలు చేపట్టేందుకు దాస్ తాజాగా ఈ ప్రకటనలు చేశారు. ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందని, నెల లేదా రెండు నెలల వరకు ఇది టార్గెట్ కంటే తక్కువగానే ఉంటుందని దాస్ అంచనా వేశారు. దీంతో కరోనాను ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవడం వీలవుతుందన్నారు.

గత నెలలోనే వడ్డీరేట్లు కోత...

గత నెల 27నే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి, 4.40 శాతానికి తీసుకొచ్చింది. అదేవిధంగా రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పా యింట్లు తగ్గించి 4 శాతంగా ఉంచింది. ఇప్పుడు మ రోసారి రివర్స్ రెపోకు కోత పెట్టింది. ఈ రేట్లను తగ్గిస్తుండటంతో, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వద్ద బ్యాంక్‌‌‌‌లు ఉంచే ఫండ్స్ తక్కువై, మార్కెట్‌‌‌‌లోకి లిక్విడిటీ పెరుగుతుంది. ఎకానమీలో ప్రొడక్టివ్ సెక్టార్లకు మరింత నగదు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా అంతకుముందు ప్రకటించిన టీఎల్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ఓ స్కీమ్ ప్రభుత్వ రంగ సంస్థలకు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కోసం తీసుకొస్తే.. తాజాగా ప్రకటించిన టీఎల్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ఓ 2.0ను ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు, మైక్రోఫైనాన్స్ సంస్థల కోసం తెచ్చారు. అదేవిధంగా మారిటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌‌‌‌పీఏ గడువు వర్తించదని దాస్ చెప్పారు.

ఎల్‌‌‌‌సీఆర్ 80శాతానికి తగ్గింపు…

లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్‌‌‌‌సీఆర్)ను కూడా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ సరళతరం చేసింది. ఈ రిక్వైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ను 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించింది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని దాస్ తెలిపారు. దీంతో బ్యాంక్‌‌‌‌ల వద్ద నగదు నిల్వలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌ను రెండు దశల్లో యథాతథ స్థితికి తీసుకురానుంది. 2020 అక్టోబర్ నాటికి 90 శాతానికి, 2021 ఏప్రిల్ నాటికి 100 శాతానికి తీసుకొస్తామని దాస్ చెప్పారు. కరోనా వైరస్ వల్ల తలెత్తిన ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో ఎలాంటి డివిడెండ్​ చెల్లింపులను బ్యాంక్‌‌‌‌లు చేయొద్దని  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ సూచించింది.

స్పెషల్‌‌‌‌గా రూ.50 వేల కోట్లు….

నాబార్డ్, సిడ్బీ, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌బీ లాంటి ఫైనాన్సియల్ సంస్థలకు స్పెషల్‌‌‌‌గా రూ.50 వేల కోట్ల ఫండ్‌‌‌‌ను దాస్ ప్రకటించారు. ప్రస్తుతం ఇవి మార్కెట్ నుంచి ఎలాంటి తాజా నిధులు సేకరించుకోలేకపోతున్నాయని దాస్ తెలిపారు. స్పెషల్ ఫండ్ నుంచి నాబార్డ్‌‌‌‌ కు రూ.25 వేల కోట్లు, సిడ్బీకి రూ.15 వేల కోట్లు, నేషనల్ హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌కు రూ.10 వేల కోట్లు ప్రకటించారు. బ్యాంక్‌‌‌‌లకు నిధుల కొరత, మార్కెట్లపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

హెల్త్ వర్కర్ల సేవలు ప్రశంసనీయం…

కరోనా బాధితులకు హెల్త్ వర్కర్లు, పోలీస్ స్టాఫ్, బ్యాంక్‌‌‌‌లు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు అందిస్తోన్న సేవలు ప్రశంసనీయమని దాస్​ చెప్పారు.   ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని అన్నారు. 1930 తర్వాత ఇంతటి సంక్షోభాన్ని ఎప్పుడు ఎదుర్కోలేదని గుర్తు చేసుకున్నారు. మన దేశంలో కూడా కొన్ని సెక్టార్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, అయితే వృద్ధి రేటు పాజిటివ్‌‌‌‌గా ఉన్న అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటని కొనియాడారు. 2020లో ఇండియా వృద్ధి రేటు ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 1.9 శాతంగా ఉండనుందని దాస్​ పేర్కొన్నారు.

ఏటీఎంలన్ని పనిచేస్తున్నాయ్…!

లాక్‌‌‌‌డౌన్ కాలంలో మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ సేవలను కస్టమర్లు బాగా వినియోగించుకుంటున్నారని దాస్ అన్నారు. బ్యాంక్‌‌‌‌ల్లో నిధుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బ్యాంకులు  కూడా యథాతథం గా పనిచేస్తున్నాయన్నారు. 91 శాతం కెపాసిటీతో ఏటీఎంలు పనిచేస్తున్నాయని, ఎప్పటికప్పుడు బ్యాంక్‌‌‌‌లు ఏటీఎంల్లో నగదు నింపుతున్నాయని తెలిపారు. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో దేశంలో పవర్ డిమాండ్ 35–30 శాతం తగ్గిందన్నారు. ఇండియా ఎక్స్ పోర్ట్స్‌‌‌‌  మార్చిలో బాగా తగ్గిపోయాయని అన్నారు. లేబర్ కొరతతో ట్రాక్టర్ సేల్స్ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌కు కాస్త బూస్టప్ ఇస్తుంది. రుతుపవనాలు నార్మల్‌‌‌‌గా ఉంటాయని అంచనాలుండటంతో, గ్రామీణ డిమాండ్ పెరుగుతుందన్నారు.

ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ ప్రకటించిన ఈ చర్యలు.. మార్కెట్లో లిక్విడిటీ అందుబాటులో ఉండేలా చేస్తాయి.  కరోనా వల్ల ఎకానమీలో ఏర్పడిన సమస్యల నుంచి బయట పడేందుకు ఉపయోగపడతాయి. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గిస్తాయి. బ్యాంక్‌‌లకు క్రెడిట్ ఫ్లో ఉంటుంది. ఇవన్ని స్వాగతించ దగిన చర్యలు. రియల్ ఎస్టేట్ పరంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌‌లు ఎలాంటి ప్రయోజనాలైతే పొందాయో.. ఎన్‌‌బీఎఫ్‌‌సీలు అలాంటి ప్రయోజనాలే పొందుతా యని ప్రకటిం చడం అభినందనీయం. ఇది రియల్ ఎస్టేట్ కు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు సానుకూ లంగా నిలుస్తుంది. రివర్స్ రెపో రేటు కోతతో.. బ్యాంక్‌‌లు అవసర మైన రంగా లకు ఫండ్స్ ను అందిస్తా యి. ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ ప్రకటనలను ఇండియన్ కంపెనీలన్నీ స్వాగతిస్తాయి.

– డాక్టర్ నిరంజన్ హిరనందాని, ప్రెసిడెంట్, అసోచామ్

రాష్ట్రాల దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోకపోతే.. కొన్ని రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉంది. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వేస్ అండ్ మీన్స్ ను ఐదు నెలలు పొడిగించింది. ఇది అంతకుముందు మూడు నెలల వరకు ఉంది. 60 శాతం ఎక్స్‌‌‌‌ ట్రాగా నిధులు అందించేందుకు సిద్ధమైంది. ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చెబుతోం ది. కష్టాల్లో ఉన్న రాష్ట్రాలను కూడా కేంద్రం ఆదుకోవాలి. వ్యాపారాలకు క్రెడిట్ అందుబాటులో ఉంచితేనే.. ఆర్థిక వ్యవస్థ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలకు, కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఎలా ఇస్తారో చూడా లి. లోన్స్ రీషెడ్యూల్ చేయాల్సిన వసరం ఉంది. బ్యాంక్‌‌‌‌ల వద్ద డబ్బులు అయిపో కుండా చూసుకోవాలి.  లాక్‌‌‌‌డౌన్ తర్వాత పరిస్థితి చూసి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటుంది.  అమెరికా, చైనాలో వృద్ధి రేటు బాగా తగ్గుతోంది.
– అనంత్ , ప్రముఖ ఆర్థికవేత్త

బ్యాంక్‌‌లు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు, ఇతర ఫైనాన్షియల్ ఇంటర్‌‌‌‌మీడియేట్లకు మరింత నగదును అందుబాటులోకి తెస్తూ ఆర్‌‌‌‌బీఐ తీసుకున్న చర్యలు.. ఫైనాన్షియల్ సిస్టమ్‌‌ను లిక్విడిటీ సమస్యల నుంచి బయటపడేయ గలదు. ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు క్రెడిట్ ఫ్లో అందించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు బూస్టప్ ఇస్తుంది. ఆర్‌‌‌‌బీఐ ప్రకారం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎన్‌‌బీఎఫ్‌‌సీలు ఇచ్చిన అవుట్‌‌స్టాండింగ్ క్రెడిట్ రూ.1,29,359 కోట్లుగా ఉంది. ఎన్‌‌పీఏ క్లాసిఫి కేషన్ నార్మ్స్‌‌ ను సరళీక రించడం ఈ రంగానికి ఊరట కల్పిస్తుంది.

– రమేష్ నాయర్, సీఈవో, కంట్రీ హెడ్, జేఎల్‌‌ఎల్ ఇండియా