RBI అకౌంటింగ్​ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చ్

RBI అకౌంటింగ్​ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చ్

న్యూఢిల్లీ: ఆర్‌‌బీఐ  ఫైనాన్షియల్‌‌ అకౌంటింగ్‌‌ ఇయర్‌‌ను మార్పు చేస్తున్నారు. ఈ ఏడాది జులై నుంచి మొదలయ్యే అకౌంటింగ్‌‌ ఇయర్‌‌ మార్చి 31, 2021 తో ముగుస్తుంది. దీంతో  కేంద్రప్రభుత్వ అకౌంటింగ్‌‌ ఇయర్‌‌ మాదిరిగానే ఆర్‌‌బీఐ ఫైనాన్షియల్‌‌ అకౌంటింగ్‌‌ ఇయరూ ఉండబోతోంది. గత 80 ఏళ్లుగా పాటిస్తున్న విధానానికి ఆర్‌‌బీఐ వీడ్కోలు చెప్పినట్లవుతోంది. 1935 లో ఆర్‌‌బీఐ ఏర్పాటయినప్పుడు జనవరి–డిసెంబర్‌‌ ఫైనాన్షియల్‌‌ అకౌంటింగ్‌‌ ఇయర్‌‌గా ఉండేది. 1940 లో దానిని జులై – జూన్‌‌గా మార్చారు. ఎకనమిక్‌‌ కేపిటల్‌‌ ఫ్రేమ్‌‌వర్క్‌‌పై ఏర్పాటయిన బిమల్‌‌ జలన్‌‌ కమిటీ సూచన మేరకే ఈ మార్పును చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మిగులు నిధులు, ఎస్టిమేట్స్‌‌ను మరింత బెటర్‌‌గా ఇవ్వడానికి ఫైనాన్షియల్‌‌ అకౌంటింగ్‌‌ ఇయర్‌‌ మార్పు వీలు కల్పిస్తుందని జలన్‌‌ కమిటీ పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి బడ్జెట్‌‌ రూపకల్పన సులభమవుతుంది. మానిటరీ పాలసీ ఫ్రేమ్‌‌వర్క్‌‌ను రివ్యూ చేస్తున్నట్లు రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌‌ వెల్లడించారు. మానిటరీ పాలసీ ఫ్రేమ్‌‌వర్క్‌‌ ఆధారంగానే రిటైల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ టార్గెట్‌‌ నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వంతో సహా వివిధ స్టేక్‌‌ హోల్డర్లతో దీనిపై చర్చించనున్నట్లు తెలిపారు. నిర్ధారిత ప్రమాణాలకు కిందే ఇన్‌‌ఫ్లేషన్‌‌ను అట్టిపెట్టే ప్రయత్నంలో 2016 లో ప్రభుత్వం ఈ ఎంపీసీని ఏర్పాటు చేసింది. ఎంపీసీకి ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ హెడ్‌‌గా ఉంటున్నారు. బెంచ్‌‌మార్క్‌‌ పాలసీ రేటు (రెపో రేటు)ను ఎంపీసీనే నిర్ణయిస్తోంది. మార్చి 31, 2021 దాకా యాన్యువల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ను 4 శాతం లోపు అట్టేపెట్టాలని ఈ ఎంపీసీకి లక్ష్యంగా పెట్టారు.