ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్

ముంబై: ఉద్యోగులు, పెన్షనర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుడ్‌న్యూస్ అందించింది. ప్రతినెలా మీ జీతం ఒకటో తేదీన పడుతోందా? కానీ ఏదైనా ఒక నెలలో ఆదివారం లేదా సెలవు వస్తే తర్వాతి రోజు వరకు ఎదురు చూడాల్సి వస్తోందా?ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. మీ జీతం పడే రోజుల్లో బ్యాంకు సెలవు ఉన్నా వేతనాలు అందుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న వెబ్ ఆధారిత బల్క్ పేమెంట్స్ వ్యవస్థ (ఎన్‌ఏసీహెచ్) రూల్స్‌లో మార్పులు చేసింది. 

బల్క్ చెల్లింపు వ్యవస్థ  ఒకటి నుంచి చాలా మందికి క్రెడిట్ బదిలీలను అనుమతించనుంది. జీతం ఉన్నవారు ముఖ్యంగా పెన్షనర్లు ఒక నెల మొదటి సెలవు దినం లేదా వారాంతంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటి అద్దె, పాఠశాల ఫీజు, EMI చెల్లించడానికి ఇబ్బందలు ఉండవు. సెలవు రోజుల్లో కూడా 24 గంటల్లో జీతాలు, పెన్షన్లు పడతాయి.  ఆగస్టు నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 

కొత్త రూల్స్‌తో కలిగే ప్రయోజనాలు

  •  సెలవు రోజుల్లో కూడా జతాలు, పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతాయి.
  •  ఏదైనా సంస్థ నుంచి మీకు రావాల్సిన వడ్డీ లేదా డివిడెండ్ వంటివి కూడా ఖాతాలో జమవుతాయి.
  •  ఈఎంఐ, క్రెడిట్ కార్డు వంటి బిల్లుల చెల్లింపులో సెలవు దినాల్లోనూ పే చేయొచ్చు. దీనికి సంబంధించిన చెల్లింపులు అదే రోజు అప్‌డేట్ అవుతుంది.
  •  ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిర్ణీత తేదీల్లో సెలవు ఉన్నా సరే లబ్ధిదారులకు డబ్బు అందుతుంది.