
- రెపో రేటు 6.5 శాతం వద్దే..
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్‌ఫ్లేషన్ 5.1 శాతంగా, జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా ఉంటుందని అంచనా
- విదేశాల్లో రూపే కార్డులు: ఆర్‌బీఐ ఎంపీసీ
బిజినెస్ డెస్క్, వెలుగు:
దేశంలో ఇన్‌ఫ్లేషన్ దిగొస్తుండడంతో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లను మార్చకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 6–8 తేదీల్లో జరిగిన మీటింగ్‌లో కీలకమైన రెపోరేటును 6.5 శాతం దగ్గరే కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండో ఎంపీసీ మీటింగ్‌లో కూడా వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచింది. ఇన్‌ఫ్లేషన్ ఇంకా 4 శాతం పైనే ఉందని, ఈ ఏడాది మొత్తం ఈ లెవెల్ పైనే ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనావేశారు. ఆరుగురు మెంబర్లు ఉన్న ఎంపీసీ కమిటీలో ఐదుగురు అకామిడేటివ్ వైఖరి ( రేట్లను పెంచే అవకాశం ఉండడం) ను విరమించుకోవడానికి ఓటు వేశారు. గ్లోబల్‌గా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడాన్ని స్లో చేశాయని, కానీ ఇన్‌ఫ్లేషన్ ఇంకా టార్గెట్‌ల కంటే పైనే నమోదవుతుండడంతో అనిశ్చితి కొనసాగుతోందని దాస్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలో రిటైల్ ఇన్‌ప్లేషన్ 18 నెలల కనిష్టమైన 4.70 శాతానికి తగ్గింది. అయినప్పటికీ 4 శాతం దిగువకు రావడానికి కనీసం రెండేళ్లయినా పడుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఆర్‌బీఐ రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను 2–4 శాతం రేంజ్‌లో ఉంచాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇన్‌ఫ్లేషన్‌ను 4 శాతం దిగువకు తీసుకురావడమే తమ టార్గెట్ అని, 2–6 శాతం లోపు ఉంచడం సరిపోదని దాస్ వెల్లడించారు.
ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు..
1. రెపో రేటు 6.5 శాతం వద్ద కొనసాగుతోంది. దీనిని మార్చలేదు.
2. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటు 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేట్ 6.75 శాతంగా ఉన్నాయి.
3. ఎకనమిక్ ఇండికేటర్లన్నీ సానుకూలమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉంది.
4. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతంగా ఉంటుందని అంచనా. క్యూ1 లో 4.6 శాతంగా, క్యూ2 లో 5.2 శాతంగా, క్యూ3లో 5.4 శాతంగా, క్యూ4 లో 5.2 శాతంగా రికార్డవుతుందని అంచనా.
5. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24 లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది. కానీ, ఇంకా హై లెవెల్‌లోనే కొనసాగుతుంది. ఇన్‌ఫ్లేషన్ తగ్గడంలో సాధారణ వర్షపాతం కీలకం.
6. ఐఎండీ అంచనాల ప్రకారం, ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు బాగానే ఉంటాయి. కానీ, మానిటర్ చేయడం ముఖ్యం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. కానీ, అవుట్‌లుక్ ఇంకా అనిశ్చితిగానే ఉంది.
7. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా నమోదవుతుంది. క్యూ1 లో 8 శాతంగా, క్యూ2లో 6.5 శాతంగా, క్యూ3 లో 6 శాతంగా, క్యూ4 లో 5.7 శాతంగా రికార్డవుతుందని అంచనా.
8. 2022–23 లో దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉంది.
9. రెపో రేటు కిందటేడాది మే తర్వాత 250 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీని ఎఫెక్ట్ రానున్న నెలల్లో వ్యవస్థలో కనిపిస్తుంది.
10. వ్యవస్థలో లిక్విడిటీ బాగానే ఉంది. రూ. 2వేల నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వస్తుండడంతో బ్యాంకుల దగ్గర లిక్విడిటీ మరింత పెరగనుంది.
11. ఓవర్‌సీస్‌లో కూడా వాడుకునేలా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను బ్యాంకులు ఇష్యూ చేస్తాయి. రూపే డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను ఇంటర్నేషనల్ జ్యురిస్‌డిక్షన్లలో కూడా ఇష్యూ చేయనున్నారు.
12. ఈ–రూపీ వోచర్లను నాన్ బ్యాంక్ పీపీఐ (ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూయర్లు) లూ ఇష్యూ చేస్తాయి.
అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చలేదు. ఫ్యూచర్‌లో ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంటుందో మార్కెట్ అంచనావేసేలా పాలసీ నిర్ణయం క్లియర్‌గా ఉంది. రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి వివిధ అంశాల్లోని ప్రోగ్రస్‌ను బట్టి పాలసీలో మార్పు ఉంటుంది. ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న గ్లోబల్ ఎకానమీకి తగ్గట్టు తాజా పాలసీ స్టేట్‌మెంట్ ఉంది.
- దినేష్ ఖారా, స్టేట్ బ్యాంక్ చైర్మన్
ఆర్‌బీఐ రెండు సంకేతాలను ఇచ్చింది. మొదటిది ఈ ఏడాది జీడీపీ గ్రోత్ 6.5 శాతం ఉంటుందని, గ్రోత్ రేటు క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గుతుందని. రెండోది ఇన్‌ఫ్లేషన్ క్యూ1 లో 4.6 శాతంగా రికార్డయినా, ఏడాది మొత్తా నికి గాను 5.1 శాతంగా నమోద వుతుందని. దీనిని బట్టి క్యూ4 వరకు రేట్ల కోత ఉండదని అర్థమవుతోంది. పాలసీ నిర్ణయాలు కేవలం తాజా క్వార్టర్‌ను బేస్ చేసుకొని తీసుకున్నవని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. అందువలన పాలసీ వైఖరి మారిందని అనుకోలేము. లాంగ్ టెర్మ్ బాండ్ ఈల్డ్స్ నిలకడగా ఉంటాయని అంచనావేస్తున్నాం.
- మదన్ సబ్నవిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్
హౌసింగ్ సప్లయ్, డిమాండ్ రెండూ పెరుగుతాయి. ఇన్‌ఫ్లేషన్ 18 నెలల దిగువకు వచ్చిం ది కాబట్టి ఫ్యూచర్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనావేస్తున్నాం.
- బొమన్ ఇరాని, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్
గత రెండేళ్లుగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్న రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు ఆర్‌బీఐ నిర్ణయం బూస్ట్ ఇస్తుంది. అయినప్పటికీ గ్రోత్‌ను పెంచేలా కొన్ని ప్రకటనలు అవసరం.
- రాజన్ బండెల్కర్, నరెడ్కో ప్రెసిడెంట్