ఆర్బీఎల్​ బ్యాంక్​ ఎండీ రాజీనామా

ఆర్బీఎల్​ బ్యాంక్​ ఎండీ రాజీనామా
  • రాజీనామా చేసిన బ్యాంకు ఎండీ
  •  కొత్త బాసుగా రాజీవ్​అహుజా​
  •  అడిషనల్​ డైరెక్టర్​గా ఆర్బీఐ ఆఫీసర్

70 ఏళ్లుగా నడుస్తున్న రత్నాకర్ బ్యాంకులో ఏం జురుగుతోంది ? హఠాత్తుగా ఎండీ, సీఈఓను సెలవుపై ఎందుకు  పంపించారు....అది కూడా తన సీజీఎంను రత్నాకర్ బ్యాంకులో ఎడిషినల్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఎండీ సెలవు నిర్ణయాన్ని ఎక్స్చేంజీలకు రత్నాకర్ బ్యాంకు తెలపడం వెనక ఏం ఉంది ? ఈ పరిణామాలు బయటకు రాగానే బ్యాంకుల యూనియన్లు చురుగ్గా ఎందుకు మాట్లాడుతు న్నాయి... మొండి బకాయిలే కాకుండా...ఇంకేవైనా సమస్య లుండొచ్చనే అనుమానాలు ఇప్పుడు మార్కెట్లో వ్యక్తం అవుతున్నాయి...బ్యాంకు యూనియన్లు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలకు ఈ మేరకు లెటర్స్ కూడా రాశాయి.

న్యూఢిల్లీ: క్రిస్మస్​ సెలవు రోజున రత్నాకర్ బ్యాంకులో ఎడిషనల్ డైరెక్టర్ నియామకాన్ని ఆర్​బీఐ ప్రకటించడం...వెంటనే ఎండీ సెలవుపై వెళ్తున్నారంటూ రత్నాకర్ బ్యాంకు ప్రకటించడం...ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ను కొత్త ఎండీ, సీఈఓగా నియమించడం....ఆదివారమైనా...సాయంత్రం మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా (ఇండియా) హెడ్​ విశ్వవీర్ అహూజా 2010లో రత్నాకర్ బ్యాంకు ఎండీగా చేరారు...గత పదేళ్లలో బ్యాంకు బిజినెస్​ను ఆయన పరిగెత్తించారు. రిటెయిల్ లోన్లు, క్రెడిట్ కార్డుల బిజినెస్​లో రత్నాకర్ బ్యాంకు దూసుకెళ్లింది.... ఈ దూకుడే కొంప ముంచి ఉంటుందని బ్యాంకింగ్ ఎక్స్​పర్టులు చెబుతున్నారు....రిటెయిల్ లోన్లు, క్రెడిట్ కార్డుల బకాయిలు సరిగా వసూలవడం లేదని, పైకి చెబుతున్నంత పటిష్టంగా రత్నాకర్ బ్యాంకు బాలెన్స్ షీటు లేదని అంటున్నారు.కొత్త ఎండీ మీడియాతో మాట్లాడుతూ....ఆర్​బీఐ ఫుల్ సపోర్టు ఇస్తోందని....భయపడాల్సిన పరిస్థితులు ఏవీ లేవని....ఆర్​బీఐ ఆదేశాలు, గైడెన్స్ మేరకే నడుచుకుంటామని ప్రకటించారు. వేగంగా ఎదిగే క్రమంలో తీసుకున్న కొన్ని చర్యల వల్ల ఊహించని కొన్ని ఫలితాలు వచ్చాయని....వాటిని మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉందని మాత్రమే చెప్పారు.

హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం?

బ్యాంకుకు సంబంధించిన అన్ని విషయాలనూ  ఆర్​బీఐ  జాగ్రత్తగా గమనిస్తోందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఆర్​బీఎల్​లో పాలనాపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులపై ఇది వరకే ఎంక్వైరీ చేసిందని అంటున్నారు.   బ్యాంకు కోరినట్టు మూడేళ్ల కాలానికి బదులుగా కేవలం ఒక సంవత్సరం మాత్రమే అహుజాను సీఈఓగా నియమించడానికి ఒప్పుకుంది.  ఆర్​బీఎల్​ బ్యాంకు 2018-19 తర్వాత కార్పొరేట్ అప్పులు విపరీతంగా ఇచ్చింది. దీంతో బ్యాంక్ మొండిబాకీలు పేరుకుపోయాయి.  2021 క్యూ2లో గ్రాస్​, నెట్​ ఎన్​ఏపీలు వరుసగా 3.34, 1.38 శాతానికి చేరాయి.  క్రెడిట్​ డిపాజిట్​ రేషియో 74.1 శాతం ఉంది. నికర లాభం 2018-19లో రూ.867 కోట్ల నుంచి 2020-21లో రూ.508 కోట్లకు పడిపోయింది. ఇదే కాలంలో ఆస్తులపై రాబడి 1.27 శాతం నుంచి 0.54 శాతానికి తగ్గింది. లోన్ బుక్​ గ్రోత్  2018–19లో రూ. 54,308 కోట్ల నుండి 2020-21 నాటికి రూ. 58,623 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ షేరు ధర కూడా 2019 జూన్-జూలైలో రూ.700 స్థాయిల నుండి శుక్రవారం నాటికి దాదాపు రూ. 172కి పడిపోయింది. గత బ్యాంక్ షేర్‌హోల్డర్ల సంపద మూడేళ్లలో భారీగా తగ్గింది.

ఇదిలా ఉంటే ఆర్‌బిఎల్ బ్యాంక్‌లో 10 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ బడా ఇన్వెస్టర్ రాకేష్ జున్‌హున్‌వాలా, డి-మార్ట్ ఫౌండర్​ ఆర్‌కె దమానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ని సంప్రదించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆర్​బీఐ ఈ ప్రపోజల్​ను పరిశీలిస్తోందని తెలిపింది. ఈవార్తలపై జున్‌జున్‌వాలా, దమానీ ఇంకా స్పందించలేదు.

ఇవీ మార్పులు..

బ్యాంకు ఎండీ, సీఈఓగా పనిచేస్తున్న విశ్వవీర్ దయాళ్​ హఠాత్తుగా పోస్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన  ‘తక్షణం’ లీవ్​పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్​బీఐ కూడా ఈ ప్రపోజల్​కు వెంటనే ఓకే చెప్పింది. దీంతో ఇంటెరిమ్​ సీఈఓ, ఎండీగా రాజీవ్​ అహుజా బాధ్యతలు తీసుకున్నారు. ఆర్​బీఐ ఆఫీసర్​యోగేశ్​ దయాళ్​ను అడిషనల్​ డైరెక్టర్​గా​నియమించారు. మొండిబాకీలు విపరీతంగా పెరగడం, పాలనాపరమైన సమస్యల వల్లే ఆర్​బీఐ రంగంలోకి దిగి ఈ చర్యలు తీసుకుందనే వాదనలను బ్యాంకు ఒప్పుకోవడం లేదు. రాజీవ్​​ మాత్రం అలాంటిదేమీ లేదని, ఆర్​బీఐ నుంచి సపోర్ట్​ ఉందని చెబుతున్నారు. ఇటీవలి మార్కెట్​ పరిస్థితుల నుంచి తాము చాలా నేర్చుకున్నామని అన్నారు. ‘‘మేం కొన్ని తప్పులు చేసిన మాట నిజమే. ఫలితంగా చాలా పెద్ద పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. డిపాజిట్లు, బ్యాలెన్స్ విషయంలో మేం మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే క్యాపిటల్​పరంగా మాకు ఇబ్బందులు ఏవీ లేవు”అని ఆయన అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే అహుజా లీవ్​పై వెళ్లారని అన్నారు. ఆర్​బీఐ మనసులో ఏముందో తాను చెప్పలేనని అన్నారు. బ్యాంకులో అన్నీ సజావుగానే జరుగుతున్నాయని స్టాక్​ ఎక్సేంజీలకు ఆర్​బీఎల్ సమాచారం పంపించింది. 2001 నుండి 2009 వరకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇండియాకు ఎండీ  సీఈఓగా పనిచేసిన విశ్వవీర్ అహుజా, విదేశీ బ్యాంకింగ్ అనుభవంతో కొత్త సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్​ను​ తీసుకువచ్చారు. భారీగా మూలధనాన్ని సమీకరించారు.  ఎక్స్ఛేంజీలలో బ్యాంకును లిస్ట్​ చేయించారు.  పేరును రత్నాకర్ బ్యాంక్ నుండి ఆర్బీఎల్ బ్యాంక్‌గా మార్చారు.