ఫుల్‌‌‌‌ స్వింగ్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌సీ 16 ప్రీ ప్రొడక్షన్ పనులు..

ఫుల్‌‌‌‌ స్వింగ్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌సీ 16 ప్రీ ప్రొడక్షన్ పనులు..

డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ‘గేమ్ చేంజర్‌‌‌‌‌‌‌‌’గా  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్..  ఇప్పుడు బుచ్చిబాబు సినిమాపై ఫోకస్  పెడుతున్నాడు. ‘ఆర్‌‌‌‌‌‌‌‌సీ 16’ వర్కింగ్ టైటిల్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌‌‌‌లో జరుగుతున్నాయని గురువారం అప్‌‌‌‌డేట్ ఇచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పటికే ఈ మూవీకి వర్క్ చేస్తున్న టీమ్‌‌‌‌లో కొందరిని పరిచయం చేయగా, తాజాగా కాస్ట్యూమ్ డిజైనర్‌‌‌‌‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేశాడు.

‘తంగలాన్’ లాంటి పీరియాడిక్ సినిమాలకు పనిచేసిన ఏగన్ ఏకాంబరం ఈ చిత్రానికి వర్క్ చేయనున్నట్టు, ఇందులోని రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్‌‌‌‌ను తను బాగా హ్యాండిల్ చేయగలడని నమ్ముతున్నట్టు బుచ్చిబాబు చెప్పాడు. ఇక ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తవడం, లొకేషన్స్‌‌‌‌ను ఫైనల్ చేయడంతో త్వరలోనే షూటింగ్ షెడ్యూల్‌‌‌‌ను స్టార్ట్ చేస్తారని చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటించనున్న ఈ చిత్రంలో శివ రాజ్‌‌‌‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై  వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.