RCB twitter hacked : హ్యాకర్ల చేతికి ఆర్సీబీ ట్విట్టర్ అకౌంట్

RCB twitter hacked : హ్యాకర్ల చేతికి ఆర్సీబీ ట్విట్టర్ అకౌంట్

ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. శనివారం (జనవరి 21) ఉదయం 4 గంటల సమయంలో అకౌంట్ హ్యాక్ చేసినట్లు ఆర్సీబీ ప్రకటించింది. హ్యాకర్లు ప్రొఫైల్ నేమ్‌ని ‘బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్’గా మార్చారు. ప్రొఫైల్ పిక్‌గా కార్టూన్ ఇమేజ్ పెట్టారు. అకౌంట్ బయోలో ఎన్‌ఎఫ్‌టీ గురించి అప్డేట్ చేయడంతో పాటు దానికి సంబంధించిన కొన్ని ట్వీట్లను పోస్ట్ చేశారు.

ఆర్సీబీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీం ట్విట్టర్ అకౌంట్ హ్యాకైంది. 2022 ఆగస్టులోనూ ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాని తిరిగి పునరుద్దరించినట్లు ఆర్సీబీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు