
ఢిల్లీకి 182 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది బెంగళూరు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 55, డుప్లెసిస్ 45 పరుగులతో చెలరేగారు. మహిపాల్ లో 54 పరుగులతో అదరగొట్టడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.
ఐపీఎల్ లో కోహ్లీ కొత్త రికార్డ్ సృష్టించాడు. ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్ లో 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 7 వేల క్లబ్ లో చేరిన ఒకే ఒక్క ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఇందులో 50 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీకి దరిదాపుల్లో ఒక్కరు కూడా లేరు. కోహ్లీ తర్వాత ధావన్ 6536 పరుగులతో సెకండ్ ప్లేసులో ఉన్నాడు.