IPL 2026: బెంగళూరు vs రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI ఇదే!

IPL 2026: బెంగళూరు vs రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI ఇదే!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని రెండు జట్లు నేడు (2026, ఏప్రిల్ 10న) బర్సపరా క్రికెట్ స్టేడియంలో పోటీ పడనున్నాయి. మూడు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా, వరుసగా రెండు విజయాలతో బెంగళూరు సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే, రన్ రేట్ ఆధారంగా రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటుంది.

పిచ్ రిపోర్ట్: 
బర్సపరా స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు బాగా సహకరిస్తుంది. అయితే, కొత్త బంతి మొదటి కొన్ని ఓవర్ల పాటు స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో బౌలర్లకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ మైదానంలో ఆరాజస్థాన్  10 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలని అందుకుంది. గత మ్యాచ్‌లో ఇక్కడే ముంబై ఇండియన్స్‌ను ఓడించి తమ జోరును చాటుకుంది. ఇక RCBకి ఈ మైదానంలో ఇదే మొదటి మ్యాచ్.. కొత్త పిచ్‌పై బెంగళూరు బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ : RCB vs RR మధ్య హై-వోల్టేజ్ పోరు.. 

వర్షం ముప్పు: 
నేటి మ్యాచ్‌కు వాతావరణం కొంత ఆందోళన కలిగిస్తోంది. గౌహతిలో 50 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అయితే, డ్రైనేజీ సౌకర్యాలు బాగుండటంతో మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:  
రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.

ALSO READ: RR vs RCB మ్యాచ్ కి వర్ష సూచన.. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.