- ఆర్డీవో పార్థసింహరెడ్డి
ఎల్లారెడ్డి, వెలుగు : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మాచపూర్ జడ్పీహెచ్ఎస్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అండర్-14, 17 బాలుర, బాలికల పోటీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న పీడీలు, పీఈటీలను అభినందించారు.
జిల్లాస్థాయిలో విజేతలైనవారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో రాజులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్రజితావెంకటరామిరెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ హీరా లాల్ నాయక్, రెజ్లింగ్ అధ్యక్షుడు విజయ్ చౌహన్, సెక్రటరీ పవన్ కుమార్, హెచ్ఎం మహేందర్ రెడ్డి, రిటర్మెంట్ ఉపాధ్యాయులు ఆకుల కృష్ణయ్య పాల్గొన్నారు.
