
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కామెంట్లపై గందర గోళం నెలకొంది. దేశంలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అంటూ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తావించడం రచ్చకు దారి తీసింది. స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన విపక్షాలు.. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అధికార, విపక్ష సభ్యులు నినాదాలతో సభ హోరెత్తింది. విపక్షాల ఆందోళనతో గందరగోళం మధ్యే లోక్ సభను జూన్ 27 కు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
అంతకు ముందు లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన ఓంబిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్..గతంలో కంటే ఈ సారి సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. సభలో తమ గొంతు వినిపించేందుకు స్పీకర్ సహకరించాలని కోరారు. సభలో మాట్లాడటానికి ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలన్నారు. సభలో విపక్షాల గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని..సభ సజావుగా నడిచినట్లు కాదని సూచించారు. ప్రజల గొంతుకు ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యమన్నారు రాహుల్.