రెడీ ఫర్​ ఎగ్జామ్​: ప్రిపరేషన్‌ ఇలా..!

రెడీ ఫర్​ ఎగ్జామ్​: ప్రిపరేషన్‌ ఇలా..!

బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు వరుసగా మూడు నోటిఫికేషన్స్​ రిలీజ్​ అయ్యాయి. ఐబీపీఎస్‌ క్లర్క్​, ఎస్‌బీఐ పీఓ  రిక్రూట్​మెంట్లతో  పాటు తాజాగా ఐబీపీఎస్‌ పీఓ/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 వేలకు పైగా జాబ్స్​ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జామ్స్​ వేరైనా మూడింటి సిలబస్​ దాదాపు ఒకేవిధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి పీఓ , క్లర్క్​ జాబ్స్​కు ఎలా ప్రిపేర్​ అవ్వాలో తెలుసుకుందాం.. 

నోటిఫికేషన్లలో సమాచారం ప్రకారం పరీక్షలు కాస్త అటూఇటుగా ఒకే సమయాల్లో జరగనున్నాయి. ఎగ్జామ్​ ప్యాటర్న్​ ప్రిలిమ్స్​కు ఒకే విధంగా ఉంటుంది. ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలు సేమ్​ ఉంటాయి. ఐబీపీఎస్‌ క్లర్క్‌ మెయిన్స్‌ కొంచెం డిఫరెంట్​గా ఉన్నా సబ్జెక్టులు మాత్రం అవే. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు పరీక్షలకూ కలిపి ఉమ్మడిగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తే సమయం, శ్రమ ఆదా అవుతాయి. 
రెడీ ఫర్​ ఎగ్జామ్​ 
ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్​ డిసెంబర్‌ 4, 11 తేదీల్లో జరగనుంది. ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్​ నవంబర్‌ చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. ఐబీపీఎస్‌ కర్క్‌ ప్రిలిమ్స్​ డిసెంబర్‌లో పీఓ పరీక్ష తర్వాత జరగవచ్చు. మొదటగా జరిగే ఎస్‌బీఐ పీఓ పరీక్ష సమయానికే ప్రిపరేషన్‌ పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు అదేవిధంగా ప్రాక్టీస్​ కొనసాగించాలి. వీలైనన్ని మాక్​ టెస్టులు రాస్తూ ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించి సరిచేసుకోవాలి.  కొత్తగా పరీక్ష రాసే అభ్యర్థులు  ప్రతి సెక్షన్​కు టైమ్​ లిమిట్​ ఉంటుంది. కావున ఇన్​టైమ్​లో ఆన్సర్​ రాసేలా ప్రాక్టీస్​ చేయాలి. ​ప్రిలిమ్స్​ తర్వాత మెయిన్స్​కు ఎక్కువ సమయం లేనందున మొదటి నుంచే రెండింటికీ కలిపి ప్రిపేర్​ అయితే ఈజీగా ఉంటుంది. ఫైనల్​ సెలెక్షన్స్​లో ప్రిలిమ్స్​ మార్క్స్​ పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్​ మీద ఫోకస్​ చేస్తూ ప్రిలిమ్స్​ క్వాలిఫై అయ్యేలా అభ్యర్థులు సిద్ధమవ్వాలి. 
సిలబస్​
ఇంగ్లిష్ లాంగ్వేజ్​: ఇందులో మార్కులు సాధించాలంటే ఆంగ్లంపై బేసిక్​ నాలెడ్జ్​ అవ‌స‌రం. సెంటెన్స్ అరేంజ్‌మెట్స్‌, సెంటెన్స్ కరెక్షన్‌, జంబుల్డ్ సెంటెన్సెస్, రూట్ వర్డ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. 
రీజనింగ్‌ ఎబిలిటి: ఈ విభాగంలో అభ్యర్థుల ఆలోచ‌నా శక్తిని పరిశీలిస్తారు. కోడింగ్, డీ-కోడింగ్, ఇన్​ ఇక్వాలిటీస్​, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్ మెంట్స్, బ్లడ్​ రిలేషన్స్​, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిలాజియమ్స్​ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టాపిక్స్​ ఎక్కువ ప్రాక్టీస్​ చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్​ గుర్తించవచ్చు. 
ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: నేషనల్​, ఇంటర్నేషనల్​ కరెంట్​ ఎఫైర్స్​పై ప‌ట్టు పెంచుకోవాలి. ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలు, క్రీడా టోర్నమెంట్లు, బ్యాంకింగ్, ఆర్థిక నిబంధనలు, అంతర్జాతీయ సంస్థలు, ద్రవ్య, ఆర్థిక విధానాలపై ఫోకస్​ చేయాలి. డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌: అభ్యర్థుల్లోని తార్కిక, విశ్లేషనాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. బార్‌గ్రాఫ్‌, పై చార్ట్‌, లైన్‌గ్రాఫ్స్‌, కేస్‌లెట్‌, డేటా కంపారిజన్‌ తదితర అంశాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. సింప్లిఫికేషన్స్​, అప్రాక్సిమేషన్స్​, లాభ-నష్టాలు మొదలైన అంశాలు బేసిక్స్​ నుంచి ప్రాక్టీస్​ చేయాలి. 
కామన్‌ ప్రిపరేషన్‌
ఐబీపీఎస్‌ క్లర్క్‌, ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌ పీఓ అన్ని ఎగ్జామ్స్​లో ప్రిలిమ్స్​ ఒకే రకంగా ఉంటుంది. సిలబస్​ సేమ్​ ఉన్నా క్లర్క్​ పరీక్షలో ప్రశ్నలు బేసిక్​ స్థాయిలో ఉంటాయి. పీఓ  ఎగ్జామ్​లో ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. జనరల్‌/ బ్యాంకింగ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ మినహా ప్రిలిమ్స్‌ మెయిన్స్‌ పరీక్షల్లో ఒకటే విభాగాలు ఉంటాయి. వీటికి కామన్‌గా ప్రిపేర్​ అవ్వాలి. 
పరీక్షలన్నీ దాదాపు ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఐబీపీఎస్‌ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతున్న వారు అదే స్ట్రాటజీ ఎస్‌బీఐ పీఓ పరీక్షకు కొనసాగిస్తే విజయం సాధించవచ్చు.  
ఎగ్జామ్​లో సక్సెస్​ కావాలంటే ముందుగా సిలబస్​లో ఇచ్చినా టాపిక్స్​ అన్ని బేసిక్స్​తో సహా ప్రిపేర్​ అవ్వాలి. తర్వాత నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్​ చేయాలి. అనంతరం మాక్​ టెస్టులు సాధన చేస్తే ఎగ్జామ్​లో అడిగే క్వశ్చన్స్​పై అవగాహన వస్తుంది. ఒకే సమయంలో మూడు బ్యాంకు నోటిఫికేషన్లు వచ్చినందున ఎస్‌బీఐ పీఓ పరీక్ష సరిగా రాయలేకపోతే ఆ తర్వాత ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష ఉంటుంది. దాని తర్వాత ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఎగ్జామ్​ కూడా ఉంది. కాబట్టి వాటిని రెట్టింపు ఉత్సాహంతో రాసే అవకాశం ఉంటుంది. సరైన ప్రణాళికతో మూడు పరీక్షలకు కలిపి ఉమ్మడిగా సిద్ధమైతే ఏదో ఒక పరీక్షలో సక్సెస్​ అవ్వొచ్చు.

ఐబీపీఎస్​ పీఓ  నోటిఫికేషన్‌ 
ఖాళీలు : 4,135; విద్యార్హత: ఏదైనా డిగ్రీ (01.10.21 నాటికి); వయసు (జనరల్‌ అభ్యర్థులు): 20–-30 సంవత్సరాలు 10.11.21 నాటికి);  ఫీజు: రూ. 175 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ) రూ.850 (ఇతరులు); చివరి తేదీ : 10 నవంబర్; ప్రిలిమ్స్​ ఎగ్జామ్​: 4 నవంబర్​ లేదా డిసెంబర్‌; మెయిన్స్: జనవరి 2022; ఇంటర్వ్యూ : ఫిబ్రవరి/ మార్చి 2022 ; తెలంగాణలో ఎగ్జామ్​ సెంటర్స్​: ప్రిలిమ్స్​ను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో, మెయిన్స్‌ హైదరాబాద్‌లో మాత్రమే ఉంటుంది; వెబ్‌సైట్‌: www.ibps.in.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: 
ఐబీపీఎస్​ పీఓ  ప్రిలిమ్స్​లో ఇంగ్లిష్ లాంగ్వేజ్​ నుంచి 30 మార్కులు, న్యూమరికల్​ ఎబిలిటి నుంచి 35, రీజనింగ్​ ఎబిలిటి నుంచి 35 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు గంట సమయం మాత్రమే కేటాయించారు.   మెయిన్స్​లో రీజనింగ్ అండ్ కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​ నుంచి 60 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 40, డేటా ఎనాలిసిస్​ అండ్​ ఇంటర్​ ప్రిటేషన్​ నుంచి 60, ఎకానమీ అండ్​ బ్యాంకింగ్​ అవేర్​నెస్​ నుంచి 40 మార్కుల చొప్పున 200 మార్కులకు ఉంటుంది. లెటర్​ రైటింగ్​ అండ్​ ఎస్సే డిస్క్రిప్టివ్​ పద్ధతిలో ఉంటుంది. మెయిన్స్​లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫైనల్​గా ఇంటర్వ్యూ చేస్తారు.                                                                                                                              వై. శ్రీనివాస రావుఅర్థమెటిక్​ ఫ్యాకల్టీ