దూసుకుపోతున్న రియల్​ఎస్టేట్

దూసుకుపోతున్న రియల్​ఎస్టేట్
  • 2030 నాటికి 1 ట్రిలియన్​ డాలర్లకు
  • దేశంలో 5.5 కోట్ల ఉద్యోగాలను ఈ రంగమే కల్పిస్తోంది
  • ఎకానమీకీ చేయూత
  • హౌసింగ్​ సెక్రటరీ దుర్గా శంకర్​ మిశ్రా

న్యూఢిల్లీ: 2030 నాటికి దేశంలోని రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ 1 ట్రిలియన్​ డాలర్లకు (రూ. 7.25 లక్షల కోట్లు) చేరుతుందని హౌసింగ్​ అండ్​ అర్బన్​ ఎఫెయిర్స్​ సెక్రటరీ దుర్గా శంకర్​ మిశ్రా చెప్పారు. 2019–20లో గ్రాస్​డొమెస్టిక్​ ప్రొడక్ట్​ (జీడీపీ)లో రియల్​ ఎస్టేట్​ సెక్టార్ వాటా 7 శాతమని, 2030 నాటికి ఇది 10 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే రంగాలలో రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ కూడా ఒకటని చెబుతూ, ఈ రంగం 11 శాతం మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని మిశ్రా అన్నారు. దేశంలోని ఎనిమిది మెట్రో సిటీల హౌసింగ్​ ప్రైస్​ ఇండెక్స్​ లాంఛ్​ ప్రోగ్రామ్​లో మిశ్రా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్​ వర్చువల్​ పద్ధతిలో సోమవారం జరిగింది. రియల్​ ఎస్టేట్​ పోర్టల్​ హౌసింగ్​.కామ్​, ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​(ఐఎస్​బీ)లు రియల్​ ఎస్టేట్​ బాడీ నారెడ్కోతో కలిసి ఈ హౌసింగ్​ ప్రైస్​ ఇండెక్స్​ను తెచ్చాయి. 2030 నాటికి దేశ ఎకానమీ 10 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, ఇందులో పది శాతం రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ నుంచి వస్తుందని మిశ్రా పేర్కొన్నారు. ఎంప్లాయ్​మెంట్​ ప్రకారం చూసినా, రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ చాలా ముఖ్యమైనదని, దేశంలోని 50 కోట్ల ఉద్యోగాలలో 5.5 కోట్ల ఉద్యోగాలను ఈ రంగమే సృష్టిస్తోందని అన్నారు. గత ఏడేళ్లలో రియల్​ ఎస్టేట్​ రంగంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. రియల్​ ఎస్టేట్​ (రెగ్యులేషన్​ అండ్​ డెవలప్​మెంట్)​ యాక్ట్  (రెరా)అమలులోకి రావడం ఈ రంగంలో మార్పులు తెచ్చిందని పేర్కొన్నారు. వెస్ట్​ బెంగాల్​, నాగాలాండ్​ రాష్ట్రాలలో తప్ప ఇతర అన్ని రాష్ట్రాలు, యూనియన్​ టెరిటరీలలో రెరా అమలులోకి వచ్చిందన్నారు. రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టులలో డీల్​ చేసే ప్రోపర్టీ బ్రోకర్లు చాలా మంది రెరా కింద రిజిస్టర్​ చేసుకున్నట్లు మిశ్రా వెల్లడించారు. రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ ఊపందుకోవడానికి గత ఏడు సంవత్సరాలుగా బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతీ బడ్జెట్​లోనూ రియల్​ ఎస్టేట్​ కోసం ఏదో ఒక అనౌన్స్​మెంట్​ ఉంటోందని చెప్పారు. రియల్​ ఎస్టేట్​ కొనుగోళ్లు–అమ్మకాలు స్మూత్​గా సాగడానికి డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​ అవసరమని మిశ్రా అభిప్రాయపడ్డారు. డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​లో డీల్స్​ ట్రాన్సపరంట్​గా సాగే ఛాన్స్​ ఉంటుందన్నారు. అమెజాన్​ లాంటి ఒక డిజిటల్​ ప్లాట్​ఫామ్​ను రియల్​ ఎస్టేట్​ కోసం​తేవాల్సిందిగా క్రెడాయ్​, నేరెడ్కోలకు ఆయన సూచించారు.   రియల్​ ఎస్టేట్​ రంగంలో క్రెడాయ్​, నేరెడ్కోలు రెండూ మన దేశంలోని మేజర్​ అసోసియేషన్లు. హౌసింగ్​ ప్రైసింగ్​ ఇండెక్స్​ గురించి మాట్లాడుతూ, డెవలపర్ల నుంచి డేటా తీసుకుని దానిని డేటా ఎనలిటిక్స్​ ద్వారా ఎనలైజ్​ చేస్తారని పేర్కొన్నారు. రియల్​ ఎస్టేట్​ రంగం మరింత పెరగడానికి ఈ ఇండెక్స్​ సాయపడుతుందని అన్నారు. ఇండ్లు కొనేవారితోపాటు, పాలసీల రూపకల్పనలో ప్రభుత్వాలకూ ఈ ఇండెక్స్​ ఉపయోగపడుతుందని మిశ్రా చెప్పారు.

హౌసింగ్​ ప్రైస్​ ఇండెక్స్​..
ఐఎస్​బీలోని శ్రీనిరాజు సెంటర్​ ఫర్​ ఐటీ, నెట్​వర్క్​డ్​ ఎకానమీ (శ్రీట్నె)లతో కలిసి ఈ హౌసింగ్​ ప్రైస్​ ఇండెక్స్​ డెవలప్​ చేసినట్లు హౌసింగ్​.కామ్​ వెల్లడించింది. దేశంలోని ఎనిమిది ప్రధాన సిటీలలోని రియల్​ ఎస్టేట్​ రేట్లు ఈ ఇండెక్స్​లో ఉంటాయని పేర్కొంది. ప్రతీ నెలా ఎన్ని ఇండ్లు అమ్ముడవుతున్నాయని, ఏ రేటుకు అమ్ముడవుతున్నాయనే వివరాలు ఇండెక్స్​ ద్వారా తెలుస్తాయని చెప్పింది. ప్రోపర్టీ కొనుగోలులో సరయిన నిర్ణయాలు తీసుకోవడానికి బయ్యర్లకు ఇదెంతో ఉపయోగపడుతుందని వివరించింది. ఏ టైములో కొనడం కరెక్టనేది అసెస్ చేసుకోవచ్చని, ఇదే విధంగా ఏ టైములో అమ్మడం కరెక్టనేది సెల్లర్లు కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. హైదరాబాద్​, అహ్మదాబాద్​, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్​సీఆర్​, కోల్​కత, ముంబై, పుణె సిటీలలోని ప్రోపర్టీల ట్రాన్సాక్షన్​ వివరాలు ఇండెక్స్​లో ఉంటాయని వివరించింది. కొత్త ప్రాజెక్టుల లాంఛ్​ వంటి అవసరాలకు రియల్​ ఎస్టేట్​ డెవలపర్లకు కూడా ఇండెక్స్​ ఉపయోగపడుతుంది. ఏ లొకేషన్​లో ప్రాజెక్టులు బాగా అమ్ముడు పోతున్నాయో తెలుసుకోవడం డెవలపర్లకు చాలా ముఖ్యమైనదని హౌసింగ్​.కామ్​ పేర్కొంది.