హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

 హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య  చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఓవ్యక్తి తన  ఇంట్లో ఫ్యాన్ కు  ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వసంత నగర్ కాలనీలో నివసించే దాసరి వరప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో  తాను నివాసం ఉంటున్న ఇంటి రెంట్ కూడా గత మూడు నెలలుగా చెల్లించడం లేదు. దీంతో  ఓనర్ అతడిపై దుర్భషాలాడినట్లు తెలిసింది. దీంతో మనస్థాపానికి గురైన వరప్రసాద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో జూన్ 10న  ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.