కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ

కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ

ఇదివరకే రియల్ మీ.. రియల్ మీ 10,10 ప్రో 5జీ ఫోన్లను లాంచ్ చేసింది. వాటి తరహాలోనే తక్కువ ధరతో ఇప్పుడు 4జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్ రియల్ మీ10ను సోమవారం భారతదేశ మార్కెట్ కు తీసుకొచ్చింది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఇందులోని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 12, రియల్ మీ యూఐ 4పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 

33 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 6.4 అంగుళాల డిస్ప్లే తో వస్తుంది. 4జీబీ ర్యామ్ 64 జీబీ మెమరీ, 8జీబీ ర్యామ్ 128జీబీ మెమరీ వేరియంట్లలో దొరుకుతాయి. వీటి ధర 4జీబీ ర్యామ్ కి రూ.12,999, 8జీబీ ర్యామ్ కి రూ.16,999 ఉంది. ఐసీఐసీఐ బ్యా్ంక్ ఆఫర్ కూడా ఇస్తుంది. ఈ ఫోన్ ఆన్ లైన్, ఆఫ్లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.