సూపర్ మొబైల్ : నిమిషం ఛార్జింగ్ పెడితే.. గంట వాడొచ్చు

సూపర్ మొబైల్ : నిమిషం ఛార్జింగ్ పెడితే.. గంట వాడొచ్చు

రియల్ మి కంపెనీ ఇండియాలో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లపై ఫోకస్ పెట్టింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిచడంలో ఆ కంపెనీ ఫోన్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇటీవల రియల్ మి CBT హ్యాండ్ సెట్ ను కేవలం రూ.7వేల 699కి విడుదల చేసింది. జూలై 3న మధ్యాహ్నం 12 గంటలకు రియల్ మి C63 అనే మరో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ బ్యాండ్ సెట్ ను విడుదల చేయనుంది. దీని ధర రూ.8వేల 999లే. ఫీచర్స్ కూడా వెల్లడించింది. 

రియల్ మి C63 స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి తేనుంది. ప్రత్యేకంగా దీంట్లో చెప్పుకోదగ్గ ఫీచర్ ఛార్జింగ్, బ్యాటరీ కెపాసిటీ.. 5000 mAh బ్యాటరీతో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సూపర్ ఫీచర్ గా కనిపిస్తుంది. యాపిల్ ఐఫోన్ తరహా కెమెరా బంప్, వీగన్ లెదర్ డిజైన్తో దీన్ని విడుదల చేసింది. గ్రీన్, బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఫీచర్స్ ఇవే: 

  • 6.74 అంగుళాల HD- IPS LCD డిస్ప్లే
  •  4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ 
  • వెనుక వైపు 50 ఎంపీ. కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 
  • యూనిసోక్ టీ612 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ యూఐ 5తో పనిచేస్తుంది