వామ్మో.. ఈ స్మార్ట్​ ఫోన్​ ధర ఇంత తక్కువా.. ఎలా కొనాలంటే...

 వామ్మో.. ఈ స్మార్ట్​ ఫోన్​ ధర ఇంత తక్కువా..  ఎలా కొనాలంటే...

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వేయిట్ చేస్తున్నారా? అది కూడా బడ్జెట్‌లో కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రియల్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో తక్కువ ధరకే కొత్త ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ Realme narzo N53 (రియల్ మీ నార్జో ఎన్ 53)పై ప్రకటించింది. దీని అసలు ధర రూ. 10,999 ఉండగా 32 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ Realme narzo N53  స్మార్ట్​ ఫోన్​ ధరను భారీగా తగ్గించింది. దీని లాంచ్ ప్రైస్ రూ.10,999 ఉండగా 32 శాతం డిస్కౌట్ ఇస్తుంది. అంటే ఈ ఫోన్​ ధర మార్కెట్లో  రూ.7,499కే దక్కించుకోవచ్చు.  అంతే కాదండోయ్​ .... నెల ఈఎమ్ఐ రూ.364 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇంకా  కొన్ని బ్యాంకుల క్రెడిక్, డెబిట్ కార్డులను ఉపయోగించి అదనంగా రూ. 750 వరకు తగ్గింపు పొందవచ్చు.ఇక  ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.7 ఇంచెస్ సూపర్ ఆమ్లోడ్ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్ కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13.0 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ 1.8 జీహెచ్‌గా ఉంది.

రియల్ మీ నార్జో ఎన్‌53 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది 4జీ నెట్వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ కార్డ్ ఉపయోగించవచ్చు. ఇందులో హైబ్రిడ్ సిమ్ కార్డ్ ఆప్షన్ లేదు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. 4GB RAM+64GB,6GB RAM+128 GB, 8GB RAM+ 128 GB స్టోరేజ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫాదర్ బ్లాక్, ఫాదర్ గోల్డ్ కలర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏడాది పాటు  కంపెనీ వారెంటీ ఇస్తుంది. ఫోన్ బాక్స్‌లో స్క్రీన్ ప్రొటెక్టర్, ఫోన్ కేస్, యూఎస్‌బీ కేబుల్ లభిస్తాయి. తక్కువ  బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ బెటర్ ఆప్షన్‌గా ఉండే ఛాన్స్ ఉంది.