హ్యాపీ మొబైల్స్​లో రియల్​మీ ఫోన్లు

హ్యాపీ మొబైల్స్​లో రియల్​మీ ఫోన్లు

హైదరాబాద్, వెలుగు :  స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ గ్లోబల్  తమ సరికొత్త రియల్​మీ 12 సిరీస్ 5జీ  స్మార్ట్ హ్యాండ్ సెట్లను హైదరాబాద్ మార్కెట్లో  విడుదల చేసింది. నగరంలోని  సుచిత్ర సర్కిల్​లో గల మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ వేదికగా నటి సంయుక్త మీనన్ శనివారం హ్యాపీ మొబైల్స్ షోరూమ్​లో వీటిని లాంచ్​ చేశారు. కార్యక్రమంలో సంస్థ సీఎండీ కృష్ణ పవన్ సహా పలువురు పాల్గొన్నారు.