రియల్టీలో మంచి ఆఫర్లు.. ఇల్లు కొనేద్దాం ఇప్పుడే!

రియల్టీలో మంచి ఆఫర్లు.. ఇల్లు కొనేద్దాం ఇప్పుడే!
  • ఇల్లు కొనేద్దాం.. ఇప్పుడే!
  • రియల్టీ ఆఫర్లతో జనం హుషారు
  • సీఐఐ, అనరాక్‌‌ ప్రాపర్టీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: హోమ్‌‌ లోన్స్‌‌ వడ్డీ రేట్లు తగ్గుతుండడం, రియల్టీ సెక్టార్ కూడా  మంచి ఆఫర్లను ప్రకటిస్తుండడంతో..వెంటనే ఇల్లు కొనేయాలని చాలా మంది అనుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే ఇల్లు కొనడం ఉత్తమమని   సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. ఇండస్ట్రీ బాడీ సీఐఐ, కన్సల్టెంట్‌‌ కంపెనీ అనరాక్‌‌ ప్రాపర్టీ ఈ సర్వేను నిర్వహించాయి. ఇన్వెస్ట్‌‌మెంట్ అసెట్‌‌గా కూడా చూస్తుండడంతో కరోనా తర్వాత రియల్ ఎస్టేట్‌‌కు ఆదరణ బాగా పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. 24 శాతం మంది రెస్పాండెంట్లు ఇప్పటికే ప్రాపర్టీలను బుక్ చేసుకున్నారు. ఇందులో కూడా 81 శాతం మంది ప్రాపర్టీ కొనడంపై ముందు నిర్ణయం తీసుకోలేదని ఈ సర్వే తెలిపింది. కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్‌‌లపై 38 శాతం మంది రెస్పాండెంట్లు ఆసక్తి చూపారని పేర్కొంది. ‘వర్క్ ఫ్రమ్‌‌ హోం, ఆన్‌‌లైన్ ఎడ్యుకేషన్ వంటి పద్ధతులు విస్తరించడంతో  పెద్ద ఇళ్లను కొనుక్కోవాలని బయ్యర్స్‌ ఆలోచిస్తున్నారు. సిటీకి దూరంగా ఉన్నా ప్రాపర్టీని తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కరోనా తర్వాత కొత్త లాంచ్‌‌లకు బాగా ఆదరణ పెరిగింది. కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్‌‌లలో ఇల్లు కొనాలని 26 శాతం మంది రెస్పాండెంట్లు చూస్తున్నారు. ఇది కరోనా ముందు స్థాయితో పోల్చితే 4 శాతం ఎక్కువ’ అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌‌ చైర్మన్‌‌ అనుజ్‌‌ పురి అన్నారు.

ఇన్వెస్ట్‌‌మెంట్‌‌గా ప్రాపర్టీ..

ఇన్వెస్ట్‌‌మెంట్‌‌గా  ప్రాపర్టీని చూడడం కూడా బాగా పెరిగింది. ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్‌‌, గోల్డ్‌‌ కంటే ప్రాపర్టీలలో ఇన్వెస్ట్ చేస్తామని 57 శాతం రెస్పాండెంట్లు పేర్కొన్నారు. పెద్ద ఇండ్లు తీసుకోవాలని 43 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. సిటీకి దూరంగా ఉన్న ప్రాపర్టీలపై ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. 28 శాతం మంది రెస్పాండెంట్లు మాత్రం సిటీలోనే ఆఫీస్‌‌కు దగ్గర ఇల్లు కొంటామని చెప్పారు. కాగా, రెడీ టూ మూవ్‌ మాత్రం ఆదరణ తగ్గింది. లాక్‌‌డౌన్‌‌ నుంచి చూస్తే వీటి సేల్స్ 17 శాతం తగ్గాయని ఈ సర్వే పేర్కొంది. ‘ఇల్లు కొనుక్కోవడానికి అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అవ్వడంతో రెసిడెన్షియల్‌‌ సెక్టార్‌‌ బౌన్స్ బ్యాక్‌‌ అయ్యింది. డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో రియల్టీ సెక్టార్‌‌‌‌లో ప్రీ సేల్స్‌‌ 1.53 మిలియన్‌‌ చదరపు అడుగులకు చేరుకున్నాయి’ అని బ్రిగేడ్‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ పేర్కొంది. ప్రీ కరోనా సర్వేతో పోలిస్తే 3 బీహెచ్‌‌కే, 4 బీహెచ్‌‌కే ప్రాపర్టీలకు పాపులారిటీ పెరిగిందని ఈ సర్వే తెలిపింది. రూ. 90 లక్షలు– రూ. 2.5 కోట్ల మధ్య రేటు ఉన్న లగ్జరీ ఇళ్లు కొనేందుకు ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది.

For More News..

ఐపీఎల్‌లో పేరు మార్చుకున్న పంజాబ్ జట్టు

జీఎస్‌టీ కిందకు నేచురల్‌ గ్యాస్‌.. ధరలు తగ్గే ఛాన్స్

హైదరాబాద్​లో క్వాల్​కామ్​కు భారీ ఆఫీస్