ఐఫోన్‌‌ వెనక హిస్టరీ చాలానే ఉంది

ఐఫోన్‌‌ వెనక హిస్టరీ చాలానే ఉంది

ఐఫోన్‌‌ ఉంటే చాలు అదో స్టేటస్‌‌గా ఫీలవుతారు. అప్‌‌డేటెడ్‌‌ వెర్షన్‌‌ ఎప్పుడు రిలీజ్‌‌ అవుతుందా? అని వెయిట్‌‌ చేస్తుంటారు. ఒక వెర్షన్‌‌ వచ్చి ఏడాది పూర్తి కాకపోయినా.. కొత్తది వచ్చిందంటే పాతదాన్ని ఎక్స్చేంజ్ చేస్తుంటారు చాలామంది. ‘ఐఫోన్‌‌ వాడాక వేరే ఫోన్‌‌ వాడలేం’ అంటుంటారు ఐవోఎస్‌‌ లవర్స్‌‌. ఇంత ఇష్టం వెనక హిస్టరీ చాలానే ఉంది. 

పర్సనల్‌‌ కంప్యూటర్స్‌‌, ఫోన్లు.. ఇలా ప్రొడక్ట్‌‌ ఏదైనా యాపిల్‌‌ మార్క్‌‌ కనిపిస్తుంది. ఎప్పటి కప్పుడు కొత్త అప్‌‌డేట్స్‌‌తో కొత్త సిరీస్‌‌ని లాంచ్​ చేస్తుంది. అలా కంపెనీ పెట్టిన పద్నాలుగేండ్లలో 13 సిరీస్‌‌లను రిలీజ్‌‌ చేసింది యాపిల్‌‌. 1976, ఏప్రిల్‌‌ 1న స్టీవ్‌‌ జాబ్స్‌‌, స్టీవ్‌‌ వొజ్‌‌నియాక్‌‌ దీన్ని స్టార్ట్‌‌ చేశారు. రెవెన్యూలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచింది. 

  • 2007లో శాన్‌‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్‌‌వరల్డ్‌‌ కన్వెన్షన్‌‌లో యాపిల్‌‌ తన మొదటి ఫోన్‌‌  లాంచ్‌‌ అయ్యింది. 4జీబీ మోడల్‌‌ (మన కరెన్సీలో) రూ.36 వేలు  8 జీబీ మోడల్‌‌ 44వేల రూపాయలు  ఉంది. 
  • 2008, జూన్‌‌ 9న ఐఫోన్‌‌ 3జీని అనౌన్స్‌‌ చేసిన యాపిల్‌‌ జులై 11న రిలీజ్‌‌ చేసింది. 8జీబీ, 16 ర్యామ్‌‌తో దాన్ని రిలీజ్‌‌ చేసింది. ఈ వెర్షన్‌‌ ఫోన్‌‌లో కొత్త అప్‌‌డేట్స్‌‌తో వచ్చిన యాపిల్‌‌ ఫోన్‌‌ రేటు తగ్గించింది.  
  • 2009లో 3జీ కంటే రెండింతలు ఫాస్ట్‌‌గా పనిచేసే ప్రాసెసర్‌‌‌‌తో ఐఫోన్‌‌ 3జీఎస్‌‌ పేరుతో కొత్త వెర్షన్‌‌ రిలీజ్‌‌ అయ్యింది. 
  • 2010లో ఐఫోన్‌‌ 4ను లాంచ్‌‌ చేసింది కంపెనీ. ఆ తర్వాత 2011లో 4ఎస్‌‌, 2012లో ఐఫోన్‌‌ 5ను లాంచ్‌‌ చేసింది.
  • 2013లో ఐఫోన్‌‌ 5సీ, 5ఎస్‌‌ను లాంచ్‌‌ చేసింది కంపెనీ. ఒకే ఏడాదిలో, ఒకేసారి రెండు సిరీస్‌‌లు రిలీజ్‌‌ చేయడం అదే మొదటిసారి. 
  • 2014లో ఐఫోన్‌‌ 6, 6ఎస్‌‌ లాంచ్‌‌ అయ్యింది. 2015లో 6ఎస్‌‌ ప్లస్‌‌ వచ్చింది. తర్వాత వరుసగా కొత్త కొత్త అప్‌‌డేట్స్‌‌, ఫీచర్స్‌‌తో 8, 8ప్లస్‌‌, ఎక్స్‌‌ఎస్‌‌, ఎక్స్‌‌ఎస్‌‌ మ్యాక్స్‌‌, 11 ప్రో, 11ప్రో మ్యాక్స్‌‌ను రిలీజ్‌‌ చేసింది. 
  • 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్‌‌లో మరిన్ని అప్‌‌డేట్స్‌‌ చేస్తూ యునిక్‌‌గా తీసుకొచ్చింది యాపిల్‌‌. టెలిఫొటో కెమెరా లెన్స్‌‌తో ఫిల్మ్‌‌మేకర్స్‌‌కు ఉపయోగపడేలా ఆ సిరీస్‌‌ని రిలీజ్‌‌ చేసింది. 
  • ఈ మధ్య రిలీజ్‌‌ చేసిన ఐఫోన్‌‌ 13 ప్రో, ప్రో మ్యాక్స్‌‌ మోడల్స్‌‌లో సూపర్‌‌‌‌ రెటీనా ఎక్స్‌‌డీఆర్‌‌‌‌ డిస్‌‌ప్లే ఫెసిలిటీ ఉంది.  ఇందులో సినిమాటిక్‌‌ మోడ్‌‌ కూడా ఉంది. అంతేకాకుండా హైక్వాలిటీ వీడియోలు ఎడిట్‌‌ చేసే ఆప్షన్‌‌ కూడా ఉంది.