తెలంగాణను అడ్డుకునే శక్తులను ఎదుర్కొంటాం: వినయ్ భాస్కర్

తెలంగాణను అడ్డుకునే శక్తులను ఎదుర్కొంటాం: వినయ్ భాస్కర్

టీఆర్ఎస్‭ను బీఆర్ఎస్‭గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం శుభసూచకమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ లక్ష్యం నెరవేరిందని చెప్పారు. రైతుల సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలపై పోరాటేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందని ఆయన అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో సైనికులుగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. 

సమైక్యరాష్ట్రాన్ని కోరుకునే శక్తులన్నీ బీజేపీ ప్రేరేపిత శక్తులేనని వినయ్ భాస్కర్ ఆరోపించారు. -తెలంగాణను అడ్డుకునే శక్తులను అడుగడుగునా ఎదుర్కొంటామని చెప్పారు. -రాష్ట్ర విభజన హామీల అమలు కోసం మరో ఉద్యమం చేపడుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ఎదురిస్తామని ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ చెప్పారు.