స్టీలుకు మస్తు గిరాకీ..

స్టీలుకు మస్తు గిరాకీ..

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: గత పదేళ్ల నుంచి తీవ్ర ఇబ్బందుల్లో కొనసాగిన  స్టీల్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది స్టీల్‌‌‌‌కు ఫుల్‌‌‌‌ డిమాండ్ క్రియేట్ అవ్వడంతో ఈ ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వచ్చింది.  ఈ ఏడాది స్టీల్ రేట్లు ఇండియాతో పాటు, గ్లోబల్‌‌‌‌గా కూడా కొత్త రికార్డ్‌‌‌‌లకు చేరుకున్నాయి. దీంతో పాటు అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్లు చైనా, రష్యాలు తమ స్టీల్ ఎగుమతులపై రిస్ట్రిక్షన్లు పెడుతున్నాయి.  దీంతో సప్లయ్‌‌‌‌ తగ్గుతోంది, స్టీల్ రేట్లు చుక్కలను చూస్తున్నాయి. దేశంలో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ జేఎస్‌‌‌‌డబ్యూ తన ప్రొడక్షన్‌‌‌‌ను మరింత పెంచాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఇంకో పదేళ్లలో తమ ప్రొడక్షన్ కెపాసిటీని రెండింతలు పెంచాలనుకుంటోంది.  టాటా స్టీల్‌‌‌‌ కూడా తన ప్రొడక్షన్‌‌‌‌ను పెంచేందుకు భారీగా ఖర్చు చేయాలని చూస్తోంది.  గత కొన్నేళ్లలో  స్టీల్‌‌‌‌ ఇండస్ట్రీకి ఇంతలా డిమాండ్ క్రియేట్ అవ్వడం ఇప్పుడే చూస్తున్నామని ఎనలిస్టులు చెబుతున్నారు.  యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను డెవలప్ చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామని ఈ ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియాలో కూడా వచ్చే ఐదేళ్లలో రూ. 100 లక్షల కోట్లను ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ కోసం ఖర్చు చేస్తామని ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. యూరోపియన్ దేశాలు కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి  రెడీ అవుతున్నాయి.  స్టీల్‌‌‌‌కు డిమాండ్ పెరగడంతో దేశంలో జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్‌‌‌‌, టాటా స్టీల్‌‌‌‌, సెయిల్‌‌‌‌ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయి. గ్లోబల్‌‌‌‌గా చూస్తే నుకర్ కార్పొరేషన్‌‌‌‌, యూఎస్‌‌‌‌ స్టీల్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏబీ ఏబీ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయి. చైనాకు వెలుపల చూస్తే, అర్సెలర్ మిట్టల్‌‌‌‌ ప్రాఫిట్స్‌‌‌‌ కూడా పెరుగుతాయి. ఈ కంపెనీ ప్రాఫిట్స్‌‌‌‌ పెప్సికో, మెక్‌‌‌‌ డొనాల్డ్స్‌‌‌‌ వంటి కంపెనీల ప్రాఫిట్స్‌‌‌‌ను మించుతాయని  అంచనా.

చైనా ప్రకటనతో స్టీల్ ధరలు పైకి..

చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా స్టీల్ ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్‌‌‌‌గా తయారవుతున్న స్టీల్‌‌‌‌లో సగం చైనా నుంచే వస్తోంది. కానీ, వాతావరణంపై స్టీల్ ప్రొడక్షన్ ప్రభావాన్ని తగ్గించాలని చైనీస్ గవర్నమెంట్ చూస్తోంది. దీనిలో భాగంగా  ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌కు ఇచ్చే ప్రోత్సాహకాలను తొలగించాలని ప్లాన్స్ వేస్తోంది. ‘చైనాలో స్టీల్ ప్రొడక్షన్‌‌‌‌పై రిస్ట్రిక్షన్లు కచ్చితంగా వస్తాయి’ అని కలానిష్‌‌‌‌ కమోడిటీస్‌‌‌‌ ఆసియా ఎడిటర్ థామస్‌‌‌‌  పేర్కొన్నారు. పెరిగిన స్టీల్ ధరలు ఇప్పట్లో దిగి రావని ఎనలిస్టులు అంటున్నారు. ఈ  ఆర్థిక సంవత్సరంలో  ఇండియాకు 140–150 మిలియన్ టన్నుల  స్టీల్ అవసరమని, ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ దేశంలో 125 మిలియన్ టన్నులు గానే ఉందని చెబుతున్నారు. 

ప్రొడక్షన్ పెంచుతున్న కంపెనీలు..

స్టీల్‌‌‌‌కు డిమాండ్ పెరుగుతుండడంతో లోకల్‌‌‌‌ కంపెనీలు తమ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంటున్నాయి. జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్‌‌‌‌ 2025 నాటికి తన ప్రొడక్షన్ సామర్ధ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ  సామర్ధ్యం 22 మిలియన్ టన్నులుగా ఉంది. దీనిలో భాగంగా  ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కొత్త  ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కృష్ణపట్నం పోర్టుకి సమీపంలో ఈ ప్లాంట్ కోసం రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుందని వార్తలొచ్చాయి. టాటా స్టీల్‌‌‌‌ కూడా  ప్రొడక్షన్ పెంచడానికి వచ్చే ఐదేళ్లలో రూ. 50–60 వేల కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించింది. 2030 నాటికి 40 మిలియన్ టన్నులకు ప్రొడక్షన్ పెంచాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది.