వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ. 50 లక్షలు..ఎక్కడంటే?

వేలం పాటలో  సర్పంచ్ పదవికి రూ. 50 లక్షలు..ఎక్కడంటే?

హనుమకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవికి ఓ గ్రామస్థులు వేలం పాట నిర్వహించారు. దీంతో రూ.50 లక్షలు వెచ్చించి ఓ న్యాయవాది ఆ పదవిని దక్కిం చుకున్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామ పంచాయతీ సర్పం చికి గ్రామ పెద్దల సమక్షంలో వేలం పాట నిర్వహించగా..అదే గ్రామానికి చెందిన న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్వర్లు వేలం పాటలో పాల్గొని సర్పంచి పదవిని రూ.50 లక్షలకు దక్కించుకున్నారు. 

అందరూ పోటీ చేసి ఎన్నికల ప్రచారం లో ఖర్చు చేయడానికంటే.. వేలం పాట ద్వారా వచ్చిన నిధులను గ్రామాధివృద్ధికి ఉపయోగించవచ్చనేది గ్రామ పెద్దల అభిప్రాయం. అందులో భాగంగా ప్రస్తుతం నిర్వహించిన వేలం పాట ద్వారా వచ్చిన రూ.50 లక్షలను గ్రామంలోని దేవాలయ నిర్మాణం, లైబ్రరీ నిర్మాణం, ఆరోగ్య కేంద్రం, గ్రామంలో కోతుల బెడద నివారణ, వాటర్ ప్లాంట్ నిర్మాణాలకు వెచ్చిచ్చేందుకు గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది.

►ALSO READ | కేసీఆర్... బీఆర్ఎస్ కు నీ కొడుకే గుదిబండ.. కేటీఆర్ ఉన్నంతకాలం మీ పార్టీని బొందపెడ్తరు: రేవంత్