ముంబైలో దంచికొడుతున్న ఎండలు

ముంబైలో దంచికొడుతున్న ఎండలు

ముంబై: ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలో వరుసగా రెండోసారి దేశంలోనే రికార్డు స్థాయి టెంపరేచర్ ఆదివారం రికార్డయ్యింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, 39.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా హీట్ వేవ్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల పాటు హీట్​వేవ్స్​ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆదివారం శాంటాక్రజ్ అబ్జర్వేటరీలో 39.4 డిగ్రీలు, కొలాబా అబ్జర్వేటరీలో 35.8 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్​ నమోదైంది. ముంబైలో ఎండ తీవ్రత పెరుగుతున్నదని, మార్చిలో రెండోసారి రికార్డు స్థాయిలో టెంపరేచర్​ రికార్డయ్యిందని ఐఎండీ సైంటిస్ట్ రాజేంద్ర జెనమణి తెలిపారు. మార్చి 6న శాంటాక్రజ్ అబ్జర్వేటరీలో 39.10 డిగ్రీల టెంపరేచర్​ నమోదైందన్నారు. ఆదివారం 39.40 డిగ్రీల టెంపరేచర్​ రికార్డైనట్లు తెలిపారు. దేశంలో ఇదే హయ్యెస్ట్​ అని వివరించారు. కొంకణ్​ ఏరియాలో ఆదివారం సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదైందన్నారు. మార్చి 5 నుంచి 7వ తేదీ మధ్య కూడా సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా రికార్డయ్యిందని తెలిపారు. సాధారణంగా ఈ టైంలో కొంకణ్​లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సముద్రపు గాలుల కారణంగా తక్కువ టెంపరేచర్​ నమోదవుతుందన్నారు. అయితే, ఏడు నుంచి పది రోజులుగా గాలులు వీయకపోవడంతో టెంపరేచర్​ పెరిగిందని వివరించారు.

మార్చి, మే మధ్య హీట్​వేవ్​ ముప్పు

నార్త్​ ఈస్ట్, ఈస్ట్​, సెంట్రల్ తో పాటు నార్త్​వెస్ట్ ఇండియాలోని కొన్ని పట్టణాల్లో మార్చి నుంచి మే మధ్య సాధారణం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చిలోనే సాధారణం కంటే రికార్డు స్థాయి టెంపరేచర్​లు​ నమోదవుతున్నాయని వివరించారు. ఇండియాకు హీట్​వేవ్స్ ముప్పు కూడా పొంచి ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించారు. నార్త్​వెస్ట్ తో పాటు సెంట్రల్ ఇండియాలోని కొన్ని రీజియన్స్​లో హీట్​వేవ్స్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సైంటిస్టులు హెచ్చరించారు.