మెదక్ జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు..అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు..అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్
  • ఆఫీసర్లకు, సిబ్బందికి సెలవులు రద్దు 
  • కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున రెడ్ అలర్ట్​ జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో మాట్లాడుతూ... ఈ నెల14 నుంచి16 వరకు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దని, అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే 93919 42254  కంట్రోల్​ రూమ్​కు సమాచారం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

పశువులకు టీకాలు వేయించండి

చిలప్​చెడ్​, మెదక్​ టౌన్​, వెలుగు: పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మెదక్​ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం చిలప్ చెడ్ మండలం బండపోతుగల్​గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరానికి హాజరై పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.  పశు వైద్యులతో కలెక్టర్ మాట్లాడి బ్లూ టంగ్ వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రిజిస్టర్లు, నమోదు వివరాలను తనిఖీ చేశారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య, నర్సాపూర్ ఏడీ జనార్ధన్, చిట్కుల్ పశు వైద్యాధికారి వినోద్, ఎంపీడీవో ప్రశాంత్, ఏపీవో శ్యామ్, ఇంఛార్జి ఎంపీవో తిరుపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.