ఎర్ర దొంగల ముఠా అరెస్ట్.. 33 దుంగలు స్వాధీనం..

ఎర్ర దొంగల ముఠా అరెస్ట్.. 33 దుంగలు స్వాధీనం..

తిరుమలలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి.33 దుంగలను సీజ్ చేసిన పోలీసులు...9 మంది స్మగర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 3 ఇన్నోవా కార్లు, ఒక హ్యుందాయి కారు, ఒక బొలెరో పిక్ అప్ వాహనం,  బైక్ లను సీజ్  చేసారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ 2 కోట్ల రూపాయిలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  చంద్రగిరి సబ్ డివిజన్ లో ఎర్రావారిపాలెం  పోలీసులకు రెడ్ శాండిల్ ను కొంతమంది దుండగులు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో ...భాకరాపేట సీఐ తులసీరామ్ ఆధ్వర్యంలో  ఎస్సై వెంకటేశ్వర్లు, భాకరాపేట ఎస్సై ప్రకాష్ కుమార్ సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లను వెంటాడి ఎల్లమంద క్రాస్ వద్ద పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న1358 కేజీల బరువు గల దుంగలు ఏ గ్రేడ్ కు చెందినవని గుర్తించారు. స్మగ్లర్లను తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.  వీరి వెనుక  బడా స్మగ్లర్లు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. 

ALSO READ:కొండెక్కాలంటే భయపడుతున్న భక్తులు.. .తిరుమల ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం